జనసేన తరుపున పోటీ చేసి ఎమ్మెల్యే గా గెలిచిన రాపాక వరప్రసాద్ తర్వాతి కాలంలో వైకాపాకు మద్దతిస్తోన్న సంగతి తెలిసిందే. జనసేనలో ఉంటూనే తన నియోజక వర్గం అభివృద్ది కోసం వైకాపాకు మద్దతిస్తున్నట్లు బాహాటంగానే చెప్పారు. వైకాపా ఏ మంచి కార్యక్రమం చేసినా ఆ వెంట తాను ఉంటానని బహిరంగంగానే చెబుతున్నారు. జగన్ చేపడుతోన్న సంక్షేమ పథకాలపై ఎప్పటిక ప్పు డు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సహా కార్యకర్తలు, అభిమానులు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా రాపాక మాత్రం డోంట్ కేర్ అంటూ ముందుకెళ్లిపోతున్నారు.
కోట్లాది మంది పవన్ అభిమానులు సోషల్ మీడియాలో ఎలాంటి చర్యలకు దిగినా రాపాక మాత్రం ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా తన పని తాను చేసుకుంటూ గెలిచిన పార్టీ ని కించ పరచకుండా మందుకెళ్తున్నారు. ఏడాది కాలంగా ఎక్కడా ఆవేశ పడి మాట్లాడ టంకానీ, అసంతృప్తిని వ్యక్తం చేయడం గానీ చేయలేదు. జనసేన ఎమ్మెల్యేని అంటూనే వైకాపా నుంచి తను చేయాలను కున్నది చేస్తున్నారు. ఇటీవలే రాజ్య సభ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో వైకాపా అభ్యర్ధికే ఓటేసినట్లు పబ్లిక్ గానే చెప్పారు. కానీ టీడీపీ నుంచి గెలిచి బయటకొచ్చి రెబల్స్ గా మిగిలిన వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం ల వ్యవహారం మాత్రం ఇంకా ఎటు తేలడం లేదు.
టీడీపీ నుంచి బయటకొచ్చి తటస్థంగా ఉన్నారు తప్ప అధికారికంగా వైకాపాలో చేరామని చెప్పింది లేదు. కానీ వెనుకుండి వైకాపాకి మద్ధతిస్తున్న మాట మాత్రం వాస్తవం. రాజ్యసభ ఎన్నికల అనంతర టీడీపీ నేతలకు, వంశీకి మధ్య మాటల యుద్ధo తారా స్థాయిలో జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా వంశీ ఏపార్టీనే మీరే తేల్చాలంటూ పౌరుషాన్ని చూపించారు తప్ప! వైకాపాకి మద్దతిస్తున్నాననిగానీ, ఆ పార్టీలో చేరానని గాని చెప్పలేదు. ఇక ఈ ముగ్గురు రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఓటు చెల్లకుండానే చేసారు.
అటు వైకాపా అభ్యర్ధులకు వేయలేదు.. ఇటు టీడీపీ అభ్యర్ధులకు వేయలేదు. మరి దీన్ని బట్టీ ఈ రెబల్స్ ముగ్గురికి వైకాపాకి మద్దతిస్తన్నాం అని గట్టిగా చెప్పేంత ధైర్యం లేదు. టీడీపీ ని వదిలేసాం అని చెప్పేటంతా తెగువా లేదంటూ! రాజకీయ వర్గాల్లో చర్చకొచ్చింది. వల్ల భనేని వంశీ మాట్లాడితే ఆవేశ పడటం..టీడీపీ నేతల్ని బూతులు తిట్టడం తప్ప ఫలానా పార్టీ నాదీ అని చెప్పలేరంటూ రాజకీయ వర్గాల్లో చర్చకొచ్చింది. చివరికి వంశీ ని టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్సీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని ప్రకటించడం గమనార్హం.