జగ్గారెడ్డిని కలిసిన రేవంత్ రెడ్డి

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏకమయ్యారు. భేదాభిప్రాయాలు పక్కనబెట్టి ఇద్దరు నేతలు కాంగ్రెస్ శాసనసభ పక్ష కార్యాలయంలో షేక్ హ్యాండ్ ఇచ్చుకుని అప్యాయంగా పలకరించుకున్నారు. ఈ ఇద్దరి కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎల్సీ కార్యాలయంలో సమావేశమైన రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి పార్టీ బలోపేతంపై చర్చించినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి వ్యుహాత్మకంగా వ్యవహరిస్తూ నేతలను కలుపుకుంటూ.. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.