సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి బిగ్ షాక్

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి షాక్ తగిలింది. ఆయనకు అప్పగించిన టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతల నుంచి తప్పించినట్లు కాంగ్రెస్ అధిష్ఠానం వెల్లడించింది. పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలు, అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి కూడా జగ్గారెడ్డిని తప్పించినట్లు పేర్కొంది. జగ్గారెడ్డి కొద్దిరోజులుగా కాంగ్రెస్ నేతలపై బహిరంగగానే విమర్శలు చేస్తున్నారు. టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీరును తప్పుపడుతున్నారు. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం లేదని మండిపడుతున్నారు. దీంతో ఆయన వ్వవహార శైలిని తీవ్రంగా పరిగణించిన పీసీసీ.. జగ్గారెడ్డికి అప్పగించిన బాధ్యతల నుంచి తప్పించింది.