Big Boss: బిగ్ బాస్ రియాలిటీ షో ఇంగ్లీష్ లో మొదలై ఆ తర్వాత హిందీకి వచ్చింది. హిందీలో బాగా పాపులర్ అయ్యాక ప్రాంతీయ భాషల్లోకి వచ్చేసింది.మొదట తమిళ, కన్నడలో వచ్చి ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక తెలుగులోకి బిగ్ బాస్ అడుగు పెట్టి ఇక్కడ హిట్ టాక్ తెచ్చుకుంది. వివాదాలకు నిలయమైన బిగ్ బాస్ లో కాంట్రావెర్సీ లతోనే ఎంతో మంది పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ రాక ముందు ఒక లెక్క బిగ్ బాస్ తర్వాత మరో లెక్క అన్నట్టు గ్లామర్ ఫీల్డ్ లోని ఆర్టిస్ట్ ల జీవితాలు బిగ్ బాస్ తో మారిపోతాయి. ఇక బిగ్ బాస్ లోని గొడవలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అందుకే ప్రతి భాషలోనూ బిగ్ బాస్ బాగా ఫేమస్ అయింది.
ఇపుడు నాన్ స్టాప్ స్ట్రీమింగ్ అంటూ 24 గంటలు బిగ్ బాస్ వచ్చేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే హిందీలో 24 గంటల నాన్ స్టాప్ స్ట్రీమింగ్ ప్రారంభించి ఒక సీజన్ ను విజయవంతంగా పూర్తి చేసారు. ఇపుడు తమిళ, తెలుగులో కూడా నాన్ స్టాప్ స్ట్రీమింగ్ ను స్టార్ట్ చేస్తున్నారు ఈ సీజన్ తో. ఇక తెలుగు లో హోస్ట్ గా నాగార్జున షో కి రెడీ అవుతుంటే తమిళం లో కమల్ హాసన్ బిగ్ బాస్ హోస్ట్ గా తప్పుకున్నారు.ఇంతవరకు అన్ని సీజన్స్ కి హోస్ట్ గా సక్సెస్ ఫుల్ గా షో రన్ చేసిన కమల్ హాసన్ నానస్టాప్ స్ట్రీమింగ్ సీజన్స్ కి హోస్ట్ గా ఉందనని తప్పుకున్నారు.
అయితే కమల్ హాసన్ ఇతర సినిమా షూటింగులతో బిజీగా ఉండడం వల్ల కాల్షీట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్లే ఈ శోధించి తప్పకున్నానని తెలియజేశారు.దీంతో ఇపుడు తమిళ బిగ్ బాస్ హోస్ట్ గా ఎవరు వ్యవహరిస్తారు అనే ప్రశ్న మొదలైంది. ఈ క్రమంలోనే తమిళ స్టార్ హీరో శింబు పేరు వినిపిస్తోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మానాడు సినిమా హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న శింబు ఇక బిగ్ బాస్ హోస్ట్ గా ఎలా చేస్తారో తెలియాల్సి ఉంది.