పెళ్లి తర్వాత అంతా మారిపోతుందా… పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన కియారా?

భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కియారా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ మరో వైపు తెలుగులో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె ధర్మ ప్రొడక్షన్ బ్యానర్ పై రూపొందిన ‘జుగ్ జుగ్ జీయో’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 24వ తేదీన విడుదలకు సిద్ధమైంది. అప్పుడే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

రాజ్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నటించిన నీతూ కపూర్, అనీల్ కపూర్, వరుణ్ ధవన్ వంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా వీరందరూ వారి పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ విధంగా వీరందరూ వారి పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ పెళ్లి తర్వాత అంతా మారిపోతుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే కియారా అద్వానీకి ఇంకా పెళ్లి కాకపోవడంతో ఈమె తన తల్లి తండ్రుల పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ విధంగా కియరా తన తల్లిదండ్రుల ఫోటోలను షేర్ చేస్తూ… ‘పర్ఫెక్ట్ మ్యారేజ్’ అంటే తన దృష్టిలో తన తల్లిదండ్రుల దేనని చెప్పుకొచ్చారు! అంతే కాదు, తన పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తనకు ఎప్పుడూ ఉంటాయన్న ఈమె నెటిజన్ల నుంచి కూడా దీవెనలు కోరుకున్నారు. ఈ విధంగా తన తల్లిదండ్రుల ఫోటోలను షేర్ చేసిన ఈమె పనిలో పనిగా పెళ్లి తర్వాత నిజంగానే అంత మారిపోతుందా… అంటూ ప్రశ్నించింది. ఈ విధంగా కియారా అద్వానీ ఇలా అడగడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక కియారా అద్వానీ రామ్ చరణ్ సరసన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC15 సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది.