పరిటాల శ్రీరామ్ కు అగ్నిపరీక్ష

paritala sri ram telugu rajyam

 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చెందటంతో ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పరిస్థితి తీసికట్టుగా మారిపోయింది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో పార్టీని నడిపే సరైన నాయకులూ కరువైయ్యారు. ఉన్న కొద్దీ మంది నేతలు కూడా పక్క పార్టీ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమలో పార్టీ పాతాళానికి పడిపోయింది. ఒకప్పుడు టీడీపీ కి కంచుకోటగా ఉండే అనంతపూర్ లో నేడు ఉనికిని కాపాడుకోలేని స్థితికి చేరుకుంది.

paritala sunitha srirama telugu rajyam

 

  అనంతపూర్ పేరుచెపితే వెంటనే గుర్తొచ్చే కుటుంబం పరిటాల కుటుంబం. టీడీపీ తరుపున మొన్నటిదాకా చక్రం తిప్పిన ఆ ఫ్యామిలీ ఇప్పుడు సైలెంట్ అయ్యిపోయింది. పరిటాల సునీత వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన పరిటాల శ్రీరామ్ మొన్నటి ఎన్నికల్లో రాప్తాడు నుండి పోటీచేసి ఓడిపోయాడు. పరిటాల కుటుంబానికి రాప్తాడు మరియు ధర్మవరంలో మంచి పట్టు ఉంది. కానీ రాప్తాడునే వాళ్ళు ఎంచుకున్నారు. ఇక ధర్మవరంలో మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీచేసి ఓడిపోయిన గోనుగుంట్ల సూర్య నారాయణ టీడీపీ పార్టీకి రాజీనామా చేసే, బీజేపీ గూటికి చేరుకోవటంతో ధర్మవరంలో టీడీపీని నడిపించే నేత లేకుండా పోయాడు. దీనితో స్థానిక టీడీపీ నేతలు ఆ బాధ్యతలను పరిటాల శ్రీరామ్ కి అప్పగించాలని కోరటం జరిగింది.

paritala sri ram telugu rajyam

 ముందు ధర్మవరం విషయంలో వెనకడుగు వేసిన శ్రీరామ్, ఇప్పుడు తన దృష్టి మొత్తం ఇక్కడే పెట్టటం జరిగింది. గత రెండు నెలల నుండి విస్తృతంగా ధర్మవరంలో తిరుగుతూ పార్టీ క్యాడర్ లో ఉత్సహం నింపుతున్నాడు. అనేక సేవ కార్యక్రమాలు చేస్తూ ముందుకి సాగుతున్నాడు. అతని వాలకం చూస్తుంటే ఇక రాప్తాడును పక్కన పెట్టేసి, ధర్మవరం నుండి తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే 2019 లో ఇక్కడ గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి స్థానికంగా బలమైన నేత, పైగా అధికారం చేతిలో ఉండటంతో ధర్మవరంలో తన బలాన్ని మరింత పెంచుకున్నాడు. సూర్యనారాయణ బీజేపీ లోకి వెళ్లటంతో దిక్కు లేకుండా అయిపోయిన టీడీపీ క్యాడర్ ను చాలా వరకు తన వెంట వచ్చేలా చేసుకోవటంలో సఫలం అయ్యాడు. కాబట్టి కేతిరెడ్డి ని తట్టుకోవటం పరిటాలకు కష్టమే అని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.