Paritala Sunitha: జగన్మోహన్ రెడ్డిని హెలికాప్టర్ దిగనివ్వము…  జగన్ కి పరిటాల సునీత వార్నింగ్!

Paritala Sunitha: రాప్తాడు ఎమ్మెల్యే మాజీ మంత్రి పరిటాల సునీత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు రామగిరికి రాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఎంపీపీ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారని రామగిరికి చెందిన కురుబ లింగమయ్యను పరిటాల వర్గీయులు దారుణంగా హత్య చేసి చంపారు.

ఇలా కురుబలింగమయ్యను చంపేయడంతో మరోసారి రాప్తాడులో ఫ్యాషన్ కి ఆజ్యం పోసినట్టు అయింది. గత కొద్దిరోజులుగా ఇదే విషయంపై పెద్ద ఎత్తున రాప్తాడులో చర్చలు జరుగుతున్నాయి .ఇక ఈ ఘటనపై ఇటు తోపుదుర్తి అటు పరిటాల ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి రామగిరికి రాబోతున్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఇలాంటి తరుణంలోని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.జగన్మోహన్ రెడ్డిని రాకుండా ఆపే దమ్ము, ధైర్యం రెండు కూడా ఉన్నాయని ఆమె వార్నింగ్ ఇచ్చారు. ఎక్కిన హెలికాప్టర్ ను దిగకుండా తిరిగి పంపే శక్తి కూడా ఉందని హెచ్చరించారు. మా కార్యకర్తలు, నాయకులు కూడా అదే కోరుకుంటున్నారని ఆమె చెప్పారు. కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాకు అలాంటి సంస్కృతి నేర్పించలేదని తెలిపారు.

గతంలో పరిటాల రవి పులివెందులకు వెళ్లినప్పుడు మీరు అడ్డుకున్నారని గుర్తు చేశారు పరిటాల సునీత. వాహనాలు తనిఖీలు చేసి… మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారని చురకలంటించారు. జగన్మోహన్ రెడ్డి ఒక చావుని కేవలం రాజకీయం చేయడం కోసమే పాపిరెడ్డిపల్లికి వస్తున్నారని ఎమ్మెల్యే విమర్శలు కురిపించారు.ప్రకాష్ రెడ్డి చెప్పిన మాటలు విని జగన్ వస్తున్నాడని నిప్పులు చెరిగారు పరిటాల సునీత. బీసీలు అంటే అంత ప్రేమ ఉంటే… రాప్తాడు నియోజకవర్గానికి ఇన్చార్జిగా బీసీ నాయకున్ని నియామకం చేయాలని హితువు పలికారు.