దుబ్బాక ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాష్ర్టంలో సంచలనంగా మారింది. ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో హఠాత్తుగా వచ్చిన పోరు ఇది. ముఖ్యమంత్రి కేసీఆర్ కి చెమటలు పట్టిస్తోన్న ఎన్నిక. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటం..ఎన్నిక బరిలో సీనియర్లు తెరపైకి రావడంతోనే కేసీఆర్ కి టెన్షన్ పట్టుకుంది. అధికారంలో ఉన్నా ఇప్పటికే ఓసారి షాక్ తగిలింది. మరోసారి అలాంటి షాక్ తగిలితే పరిస్థితి ఏంటి? అన్నది కేసీఆర్ ని ఇప్పుడు కలవర పెడుతుంది. సీటు ఎంపిక విషయంలో కేసీఆర్ తర్జన భర్జన పడుతున్నారు. రామలింగా రెడ్డి భార్యకు సీటు ఇవ్వాలా? లేక రామలింగా రెడ్డి కుమారుడిని బరిలోకి దించాలా? అని సీరియస్ గా ఆలోచన చేస్తున్నారు.
ఇక ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నుంచి విజయశాంతి బరిలోకి దిగుతారు అని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ నియోజక వర్గంలో టీఆర్ ఎస్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. రేవంత్ రెడ్డి, ఉత్తమ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క లాంటి వాళ్లు టీఆర్ ఎస్ పై తీసుకొచ్చిన వ్యతిరేకత ఆ నియోజక వర్గంలో కలిసొస్తుందని కాంగ్రెస్ వాదులు భావిస్తున్నారు. అది పూర్తిగా గ్రామీణ ప్రాంతం కావడంతో కాంగ్రెస్ అభ్యర్ధి విజయ ఢంకా మోగించడం ఖాయంగా వినిపిస్తోంది. అలాగే బీజేపీ నుంచి రఘునందన్ రావు బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. 2014, 2018 ఎన్నికల్లో అదే నియోజక వర్గం నుంచి బీజేపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్ధి. మరోసారి రఘునందన్ కే టిక్కెట్ ఖాయం చేసినట్లు సమాచారం.
రెండుసార్లు ఓడిపోయిన సానుభూతి స్థానిక ప్రజల్లో ఉందనే టాక్ బలంగానే వినిపిస్తోంది. విజయశాంతి ఛరిష్మా… రఘునందన్ రావు కాన్ఫిడెన్స్ ..రాష్ర్టంలో తాజా పరిస్థితుల నేపథ్యంలో వస్తోన్న వ్యతిరేకత కేసీఆర్ కి తలబొబ్బి కట్టిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరం. వీళ్లిద్దరిని బీట్ చేసి గులాబీ జెండాని ఎలా! రెప రెపలాడించాలని కేసీఆర్ కుయుక్తులు పన్నుతున్నట్లు సమాచారం. పైకి తనయుడు కేటీఆర్ గెలపు నల్లేరు మీద నడకే అన్నట్లు వ్యవహరించినా లోలోపల బయటకు చెప్పుకోలేని టెన్షన్ వెంటాడుతుందని పొలిటికల్ కారిడార్ లోచర్యనీయాంశంగా మారింది.