Varun Sandesh: నా గురించి ఆ టైం లో వచ్చిన వార్తలు అబద్దం: వరుణ్ సందేశ్

Varun Sandesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో వరుణ్ సందేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుణ్ సందేశ్ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు ఇండస్ట్రీ లో తన చేదు అనుభవాల గురించి ఒక సందర్భంలో వెల్లడించారు. ఆడిషన్స్ జరిగిన కూడా దాని వల్ల కాకుండా సినిమాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల హీరో అవకాశం వచ్చిందన్న వార్తలపై హీరో నటుడు వరుణ్ సందేశ్ స్పందించారు. తాను ఇప్పటివరకు ఎలాంటి సినిమాకు ప్రొడ్యూస్ చేయలేదని సినిమాలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశాను. కానీ ఇలా ఇన్వెస్ట్ చేయడం మాత్రం ఎప్పుడూ జరగలేదని ఆయన తేల్చి చెప్పారు. కానీ అలా ఎందుకు ప్రచారం జరిగింది మాత్రం తనకు తెలియదని ఆయన అన్నారు.

ఆనంద్, గోదావరి లాంటి అద్భుతమైన సినిమాలను అప్పటికి చేసి ఉన్న శేఖర్ కమ్ముల గురించి వరుణ్ సందేశ్ ఈ విధంగా చెప్పారు. అంత గొప్ప డైరెక్టర్ కి తాను నచ్చుతాడు లేదో అసలు ఈ సినిమాకి ఎంపిక అవుతానా లేదా అని అనుమానం కలిగేదని వరుణ్ సందేశ్ అన్నారు అదృష్టం కొద్దీ ఆయన సినిమాకి సెలెక్ట్ అయ్యాను అని తెలిపారు. ఆయన లేకపోతే నిజంగా తాను ఇక్కడ ఉండే వాడిని కాదని వరుణ్ స్పష్టం చేశారు. ఆయన తన జీవితానికి పిల్లర్ లాంటి వారిని ఆయన మూలానే ఈరోజు సినిమాలు ఇంకా చేయగలుగుతున్నాను అని వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చారు.

శేఖర్ కమ్ముల, దిల్ రాజు.. వాళ్ళిద్దరు తన జీవితంలో మర్చిపోలేని వ్యక్తులని వరుణ్ సందేశ్ అన్నారు. శేఖర్ కమ్ముల సినిమాలు తీస్తే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి దిల్ రాజు అని వరుణ్ చెప్పారు. వాళ్ళిద్దరూ తనకి లెఫ్ట్, రైట్ లాగా ఉన్నారని ఆయన తెలిపారు. వాళ్ళు లేకపోతే తాను ఈ స్థితిలో ఉండేవాడిని కాదేమో అని వరుణ్ సందేశ్ వివరించారు.