అయినా డోంట్ కేర్ అంటూ కేసీఆర్ ఆ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చారు. తాజాగా మరో కొత్త చట్టం తీసుకొచ్చి రెవెన్యూ శాఖనే ప్రక్షాళనకు రంగం సిద్దం చేస్తున్నారు. అవినీతి రహిత తెలంగాణగా మార్చి చూపిస్తానని నడుం బిగించారు. రాష్ర్టంలో రెవెన్యూ చట్టం తీసుకొచ్చేందుకు కేసీఆర్ ఈసారి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే ఇది అమలులోకి రావాల్సి ఉంది. కానీ ఉద్యోగుల నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగా వాయిదా పడింది. అయినా ఈసారి రోడ్డు మీద గొడవ చేసినా..నిరసనలు చేసినా రెవెన్యూ చట్టాని తీసుకొచ్చి తీరుతానని శబద్ధం చేసి ఆ విధంగా ముందుకెళ్తున్నారు కేసీఆర్.
ఇది నిజంగా సంచలన నిర్ణయమే..అమలు చేయాల్సిన చట్టమే. రెవెన్యూ శాఖలో జరిగే అవినీతి గురించి చెప్పాల్సిన పనిలేదు. మండల స్థాయిలో వీర్వో దగ్గర నుంచి ఎమ్మార్వో వరకూ ఏ పనిచేయాలన్నా! లంచాలతో ముడిపడినదే. ఆ మధ్య ఓ రైతు ఏకంగా ఏమ్మార్వోని పెట్రోల్ పోసి నిప్పంటించి..తాను నిప్పటించుకున్నాడు. ఆ తర్వాత విచారణ లో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. ఆ ఎమ్మార్వో ఎలాంటి అవినీతికి పాల్పడిందో బయటకు వచ్చింది. ఆ ఘటన తర్వాత పలు జిల్లాల్లో ఎమ్మార్వోలు లంచాలు తీసుకుంటూ దొరికిన సంఘటున్నలున్నాయి.
ఇటీవలే ఎమ్మార్వో నాగరాజు 10 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. అంతకు ముందు ఇలాంటి ఘటనలు ఎన్నో. అందుకే ఈసారి కేసీఆర్ ఉపేక్షించేది లేదని రెవెన్యూ చట్టం చేయబోతున్నారు. ఈ దెబ్బకి ఒక్కో ఉద్యోగి తాట తీయడానికి ఛాన్స్ ఉంటుంది. అవినీతికి..అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా పర్మినెంట్ గా ఉద్యోగానికి రిజైన్ చేసి..చట్టరీత్యా శిక్ష పడేలా చట్టాన్ని అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కొన్ని దశాబ్ధాలుగా రెవెన్యూ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని….లంచం పెట్టనిదే ఎమ్మార్వో కార్యాలయంలో పనవ్వదని వాపోతున్నారు.
గ్రామ వీర్వో నుంచి ఎమ్మార్వో వరకూ మధ్యలో గుమాస్తాలు… ఆర్ ఐ ఇలా చాలా మందికి చేతులు తడపాల్సి వస్తోందని…వీటన్నిటికి ఇప్పటికైనా స్వస్తి పలకాలని ప్రజలు కోరుతున్నారు. భూముల కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో రిజిస్ర్టార్లు, సబ్ రిజిస్ర్టార్లు మధ్య వర్తుల ద్వారా పెద్ద ఎత్తున లంచాలు తీసుకుంటున్నారని, కొన్ని సంవత్సరాలుగా లంచాలకు అలవాటు పడిపోయి బ్రతుకుతున్నారని ప్రజలు మండి పడుతున్నారు. 2020-21 కైనా ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ తాజా నిర్ణయంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ReplyForward
|