Aravind Kejriwal : ఢిల్లీ పూర్తిస్థాయి రాష్ట్రం కాదు. అక్కడ ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికి పరిమితమైన అధికారాలే వున్నాయ్. అందుకే, ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ అధికారంలో వున్నా, కేంద్రంలోని మోడీ సర్కారు లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా అక్కడి ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టేస్తోంది.
కానీ, పంజాబ్ పూర్తిస్థాయి రాష్ట్రం. ఇక్కడెలా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని మోడీ సర్కారు ఇరకాటంలో పెట్టగలుతుంది.? అరవింద్ కేజ్రీవాల్.. ఒకప్పుడు సామాన్యుడు.. ఇప్పుడు అసామాన్యుడు. గతంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఢిల్లీలో మట్టి కరిపించిన ఘనుడు.
ప్రస్తుతం పంజాబ్‌లో పాగా వేసేశాడు తన పార్టీని అక్కడ అధికారంలోకి తీసుకురావడం ద్వారా. 2024 ఎన్నికల నాటికి కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయం తామేనని అంటున్నారు అరవింద్ కేజ్రీవాల్. (Aravind Kejriwal)..
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇప్పుడు నయా బాహుబలి అంటే దేశ రాజకీయాల్లో అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే. దేశంలో రెండు రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో వుంది. ఇదేమీ చిన్న విషయం కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ మీద అవినీతి మరక లేదు ఇప్పటిదాకా. అదే పెద్ద అడ్వాంటేజ్ ఆ పార్టీకి.
ఢిల్లీ, పంజాబ్.. అలాగే దేశవ్యాప్తంగా విస్తరించబోతున్నామని చెబుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ, తెలుగు రాష్ట్రాలపైనా స్పెషల్ ఫోకస్ పెట్టింది. అయితే, తెలుగు నాట ఆమ్ ఆద్మీ పార్టీకి అంత తేలిక కాదు. ఇక్కడి రాజకీయాలు వేరు. లోక్ సత్తా కూడా తెలుగునాట నిలబడలేకపోయింది.