పురందరేశ్వరి ‘ తలరాత ‘ ఒక్క మధ్యాన్నం ఇన్సిడెంట్ తో టోటల్ గా మారిపోయింది !

ఏదైనా సాధించాలని ఆశపడగానే అది నెరవేరదు.. ఇందుకు గాను కొంత నిరీక్షణ కావాలి.. అప్పుడే దాని తాలూకూ ఫలితం విజయం వైపు నడిపిస్తుంది.. ఇదే ఫార్ములా ప్రస్తుతం పురంధేశ్వరి విషయంలో నిజం అయినట్టుగా కనిపిస్తుందట.. అదెలా అంటే ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ నుంచి ఫిరాయించి బీజేపీ గూటికి చేరాక ఆమెను కాషాయం పెద్దగా పట్టించుకోలేదన్న బాధ ఉండేది.. దీనికి కూడా కారణం లేకపోలేదు.. సర్వసాధారణంగా బీజేపీలోని పెద్దలు బయట పార్టీ వారిని ఒక పట్టాన నమ్మరు. అలా కాంగ్రెస్ నుంచి వచ్చిన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి ఇన్నాళ్లూ సరైన గుర్తింపు దక్కలేదట.. కానీ ఇప్పుడు పురంధేశ్వరికి బీజేపీలో మంచి రోజులు వచ్చినట్లు తెలుస్తుంది..

ఇన్నిరోజులు పట్టి పట్టనట్లున్న వారు ఆమెను ఏకంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిని చేశారు. అయితే బీజేపీ ఈ విషయంలో ఏమాత్రం గుడ్డిగా ఆలోచించలేదనే తెలుస్తుంది.. రాష్ట్రంలో కూడా తన పార్టీ పునాదులు బలంగా కావడానికి పురంధేశ్వరికి ఈ పదవి ఇచ్చినట్లుగా భావిస్తున్నారట విశ్లేషకులు.. ఇప్పటికే వైఎస్ జగన్‌ను మచ్చిక చేసుకుంటున్న కమళం మరోవైపు తమ వ్యూహాన్ని దారి మళ్లించి ఇలా ప్లాను వేస్తుందని తెలుస్తుంది.. ఇకపోతే ముందుగా సోము వీర్రాజును ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ చేసి ఉత్తర కోస్తాలో కీలక కాపు సామాజికవర్గాన్ని టార్గెట్ చేసింది. ఇపుడు దక్షిణ కోస్తాను దృష్టిలో పెట్టుకుని జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరిని తీసుకున్నారట.. ఒక దశలో బీజేపీ తమ పార్టీ బలోపేతం కోసం దూరంగా ఆలోచించింది అనుకోవాలి..

సోము వీర్రాజు ద్వారా కాపులను, పురంధేశ్వరి ద్వారా కమ్మలను చేరదీయాలని బీజేపీ మాస్టర్ ప్లాన్ వేస్తోందనుకుంటున్నారు.. ఒకరకంగా ఈ ఫార్ములా ద్వారానే 2014లో చంద్రబాబు ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రి కాగలిగారు.. ఇదే ప్లాన్ ప్రస్తుతం బీజేపీ అనుసరిస్తుంది.. ఇకపోతే ఇక్కడ సోము వీర్రాజు తోపాటుగా, పవన్ కళ్యాణ్ కూడా జత కలిసాడు. ఇక రానున్న ఎన్నికల్లో బీజేపీకి తిరుగుండదు అనుకుంటున్నారట.. కాబట్టి ఈ విషయంలో బీజేపీ తెలివిగానే అడుగులు వేస్తుందనుకోవాలి. కానీ ఏపీ ప్రజల మనసులో ఏముందో తెలియదు కదా..