చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా అత్యాచారాలు మాత్రం అదుపులోకి రాలేదు. దిశ లాంటి చట్టాలు తీసుకొచ్చినా యథేశ్చగా మానభంగాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీ నిర్భయ ఘటనకు ముందు…హైదరాబాద్ ప్రియాంక రెడ్డి ఘటన తర్వాత ఎన్నో ఘటనలు తెరపైకి వచ్చాయి. వాటిలో ఎంత మందికి శిక్ష పడింది? ఎంత మంది ఆడపిల్లలకు న్యాయం జరిగింది? అంటే సరైన సమాధానం దొరకదు. ఆ మధ్య ఉత్తరాఖాండ్ ఎమ్మెల్యే మహేష్ నేగి ఓ యువతిపై అత్యాచారినికి పాల్పడినట్లు ఓ యువతి ఆరోపించిన ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. ఈ ఘటన లో ఆ ఎమ్మెల్యే భార్య పేరు కూడా తెరపైకి వచ్చింది.
ఇద్దరు కలిసి కట్టుగానే ఆ యువతిని మానసికంగా..శారీరకంగా వేధించినట్లు వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేయాలని పోలీసుల చుట్టు తిరిగింది. అయినా లాభం లేకపోయింది. చివరికి కోర్టును ఆశ్రయించింది. దీంతో పలు విచారణల అనంతరం ఎట్టకేలకు ఈ కేసుపై స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఎమ్మెల్యే దంపతులపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలి చ్చింది. ఎమ్మెల్యే నేగి తో రెండేళ్లగా సంబంధం ఉందని..ఓ బిడ్డ కూడా పుట్టిందని ఇద్దరి డీఎన్ ఏలు పరీక్షిస్తే అసలు నిజం తెలుస్తుందని ఆ యువతి వాపోయింది. దీనికి సంబంధించి ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది. దీంతో ఉత్తరాఖాండ్ రాజకీయాల్లో ఒక్కసారిగా సంచలనం రేగింది.
ఎమ్మెల్యేని వెంటనే పదవి నుంచి తప్పించాలని ప్రజల నుంచి డిమాండ్లు వ్యక్తం అయ్యాయి. ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ప్రజా ప్రతినిధిగా ఉండి ఇలాంటి సిగ్గు మాలిన పనులు చేస్తాడా? ఆయన భార్య ఓ మహిళ అయి ఉండి ఇలాంటి దారుణానికి ఎలా ప్రోత్సహించిందని! తిట్టిపోసారు. ఇరువుర్ని నడిరోడ్డు మీద ఉరి తీయాలని డిమాండ్లు వ్యక్తం అయ్యాయి. మొత్తానికి డెహ్రాడూన్ కోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యే దంపతులపై కేసు నమోదైంది. ఆరోపణలు నిజమైతే శిక్ష తప్పదు.