ప్రస్తుత కాలంలో మహిళలపై అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. చిన్నపిల్లలు ముసలివారు అని తేడా లేకుండా కొందరు పురుషులు వారి కామ వాంఛలు తీర్చుకోవడానికి మృగాలుగా ప్రవర్తిస్తున్నారు. అయితే ఇటువంటి నేరాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినప్పటికీ వీరి ఆగడాలకు అంతులేకుండా పోతుంది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడటమే కాకుండా వారి నగ్న ఫోటోలు, వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెడతామంటూ మహిళలను బెదిరిస్తూ వారిపై పలుమార్లు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఇటువంటి దారుణ సంఘటన మరొకటి చోటు చేసుకుంది. కూల్ డ్రింక్ లో మధ్యమందు కలిపి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రిషికేష్ లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే…ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో ఓ డ్రగ్ అడిక్షన్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. రిషికేశ్ లోని పునరావాస కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఢిల్లీకి చెందిన ఒక యువతి ద్వారా బాధితురాలికి సదరు నిందితులతో పరిచయం ఏర్పడింది. చాలాకాలంగా వీరు తరచూ మాట్లాడుకునే వారు. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత నిందితుడు ఆమెకు కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. స్పృహ కోల్పోయిన తర్వాత ఇద్దరు వ్యక్తుల కలిసి ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారు. సదరు బాధితురాలు స్పృహలో నుంచి చేరుకున్న తర్వాత ఆమెకు తన నగ్న వీడియోలు ఫోటోలు చూపించి బెదిరించారు.
అంతేకాకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే ఈ ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాలలో పెడతామంటూ ఆమెను బెదిరించేవారు. ఇలా యువతిని బెదిరించి పలుమార్లు నగరం బయటికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడేవారు. అయితే సదరు నిందితుల ప్రవర్తనతో విసుకు చెందిన బాధితురాలు తనపై జరుగుతున్న హత్యాచారాన్ని భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొదట పునరావస కేంద్రాన్ని సీజ్ చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి వారిని అరెస్టు చేశారు. యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులపై సెక్షన్ 376, సెక్షన్ 328, సెక్షన్ 506 కింద మత్తుమందు ఉపయోగించి,యువతిపై అత్యాచారం చేసి బెదిరింపులకు పాల్పడటంతో పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు.