కంటెస్టెంట్ల ఎంపికలో బిగ్ బాస్ యాజమాన్యం అతి తెలివి.. అలాంటివారికే ప్రిఫరెన్స్..?

బుల్లితెర మీద ప్రసారమైన రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాల్టీ షో కి ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగులో బుల్లితెర మీద 5 సీజన్ లు ప్రసారం కాగా.. ఒక సీజన్ ఓటిటిలో ప్రసారమయ్యి ప్రేక్షకుల ఆదరణ పొందింది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సీజన్ కోసం కంటెస్టెంట్ల ఎంపిక కూడా కొనసాగుతోంది.

అయితే బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపిక మన తెలుగులో మాత్రం చాలా విచిత్రంగా జరుగుతుంది. కొంతమంది డబ్బు సంపాదించడం కోసం ఈ షోలో పాల్గొనటానికి ఆసక్తి చూపుతారు. మరి కొంతమంది పాపులారిటీ కోసం బిగ్ బాస్ యాజమాన్యానికి డబ్బు ఇచ్చి మరి ఈ షోలో పాల్గొంటారు. అయితే ప్రస్తుతం సీజన్ 6 కోసం బిగ్ బాస్ యాజమాన్యం వారు కంటెస్టెంట్ల ఎంపికలో అతి తెలివి ప్రదర్శిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాపులారిటీ కోసం బిగ్ బాస్ షో లో పాల్గొనాలనుకునే వారికి బిగ్ బాస్ యాజమాన్యం ప్రాధాన్యత ఇస్తున్నట్టు సమచారం.

బిగ్ బాస్ షో లో పాల్గొనటానికి ఆసక్తి చూపేవారిని ఉచిత అగ్రిమెంట్‌ చేసుకోవాలి అంటూ డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తొంది. పారితోషికం కోసం బిగ్ బాస్ కి వచ్చేవారికి అంతో ఇంతో పారితోషికం ఇస్తున్నారు. కానీ కేవల పాపులారిటీ కోసం వచ్చే వారికి మాత్రం రూపాయి కూడా చెల్లించకుండా పాల్గొనాలని డిమాండ్ చేస్తున్నారు.ఇలా బిగ్ బాస్ లో పాల్గొనటం వల్ల పబ్లిక్ లో మంచి గుర్తింపు వస్తుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ లభిస్తుంది. దాంతో భారీ ఆదాయం వస్తుందని భావించి చాలా మంది ఉచితంగా బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్ళటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ యాజమాన్యం వారిది మామూలు తెలివి కాదు బాబోయ్.