అక్టోబర్ నెలలో ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం… ఈ రాశుల వారిపై ప్రభావం..?

2022 సంవత్సరానికి గాను అక్టోబర్ నెలలో చివరి సూర్య గ్రహణం రానుంది. అక్టోబర్ నెలలో సూర్యుడు శుక్రుడు బుధుడు కుజుడు, శని గ్రహాల స్థానంలో మార్పు రావడం వల్ల కొన్ని రాశుల వారిపై ఈ మార్పు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అక్టోబర్ 25 మధ్యాహ్నం 02.29 నుండి సాయంత్రం 06.32 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించే అవకాశం లేదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ సూర్యగ్రహణం కారణంగా కొన్ని రాశుల వారిపై దుష్ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు వెల్లడించారు. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండకపోతే సూర్యగ్రహణం వల్ల తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.

కన్యా రాశిలో జన్మించిన వారి మీద సూర్యగ్రహణం చెడు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సూర్యగ్రహణం వల్ల కన్యా రాశి వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. సూర్యగ్రహణం ప్రభావం వల్ల కన్యా రాశి వారి జీవితంలో అదే డబ్బు ఖర్చులు పెరగటం వల్ల ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో ఆర్థిక సమస్యలతో సతమతమవుతారు. అందువల్ల ఆర్థికపరమైన విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి ఆచితూచి అడుగులు వేయటం మంచిది.

ఇక సూర్యగ్రహణం కారణంగా వృశ్చిక రాశి వారి మీద కూడా చెడు ప్రభావం ఉంటుంది. మీరు కూడా ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఆర్థికపరమైన విషయాలలో ఆచితూచి అడుగు వేయటం మంచిది.

సూర్యగ్రహణం కారణంగా వృషభ రాశిలో జన్మించిన వారి ఆరోగ్యం మీద చెడు ప్రభావం పడుతుంది. అందువల్ల ఈ రాశిలో జన్మించిన వారు వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం చాలా అవసరం. దీంతో వారు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవటం మంచిది.