Today Horoscope: జనవరి 31 వ తేదీ మంగళవారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: వృధా ఖర్చులు పెరుగుతాయి!

వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో శ్రమ తప్పదు. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది. తరచూ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది. కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వృషభరాశి: గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు!

గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చ చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. బయట నుండి మీ సొమ్ము సమయానికి తిరిగి మీ చేతికి అందుతుంది. మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

మిధునరాశి: ఆరోగ్యపరంగా చికాకు తప్పదు!

ఆరోగ్యపరంగా చికాకు తప్పదు. వ్యాపారస్తులు జాగ్రత్త అవసరం. చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు ఉంటాయి. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. ఉద్యోగమున మీ కష్టం ఫలించదు. తరచూ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరంటే గిట్టరి వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి: నూతన వస్తూ ఆభరణాలు కొనుగోలు చేస్తారు!

నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. మీ స్నేహితులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు. కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది. కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తవుతాయి చాలా సంతోషంగా ఉంటారు.

సింహరాశి: వ్యాపారస్తులు లాభాల బాటలో సాగుతారు!

వ్యాపారస్తులు లాభాల బాటలో సాగుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.మీ సోదరులతో శుభకార్య విషయాలపై చర్చ చేస్తారు. మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

కన్యరాశి: దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి!

దూరప్రాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. నూతన రుణాలు చేస్తారు. ఇంట బయట బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేపట్టిన పనుల్లో అడ్డంకులు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో సమస్యలు అధికమవుతాయి. దూర ప్రాంతాల బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించిచర్చలు చేస్తారు.

తులరాశి: చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి!

చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. దూర ప్రయాణాల సూచనలున్నవి. బంధుమిత్రులతో వాదనలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపార ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగకు నిరాశ పెరుగుతుంది. రెండు రకములైన ఆలోచనల వలన ధన నష్టాలు తప్పవు. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.

వృశ్చికరాశి: ఉద్యోగ వాతావరణం మనశ్శాంతిగా ఉంటుంది!

ఉద్యోగ వాతావరణం మనశాంతిగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొన్ని కార్యక్రమాలు చేపడతారు. వృత్తి వ్యాపారాల్లో అంచనాలు నిజమవుతాయి. తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి. అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

ధనుస్సురాశి: వ్యాపారాలు గతం కంటే మెరుగుపడతాయి!

వ్యాపారాలు గతం కంటే మెరుగుపడతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు సనుకూలమవుతాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

మకరరాశి: దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు!

దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాబడికి మించి ఖర్చులు పెరుగుతాయి. మీ సోదరులతో ఆస్తి వివాదాలు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాల్లో ఊహించని ఇబ్బందులు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. మీరు పని చేసే చోట ఒత్తిడి అధికమవుతుంది. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

కుంభరాశి: ఆర్థిక సమస్యలు తప్పవు!

ఆర్థిక సమస్యలు తప్పవు. చేపట్టిన పనుల్లో కష్టానికి తగ్గ ఫలితం ఉండదు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. దూర ప్రాంతాల బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

మీనరాశి: ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది!

ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. స్నేహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో మీ సేవలకు తగిన గుర్తింపు పొందుతారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.