Today Horoscope: ఫిబ్రవరి 1వ తేదీ బుధవారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: దూర ప్రాంతాల బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి!

దూర ప్రాంతాల బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు. గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరకదు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది. మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

వృషభరాశి: అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు!

అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు. మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది. కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది. మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీ పాత స్నేహితులని కలుసుకుంటారు.

మిధునరాశి: ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి!

ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రారంభించిన పనులను వాయిదా వేయడమే మంచిది. మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. కొన్ని కొత్త పాటలు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి మాట్లాడతారు. ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అందుతాయి.

కర్కాటక రాశి: తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి!

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తలదూర్చడానికి ప్రయత్నిస్తారు. తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనుల్లో అంతా మంచే జరుగుతుంది.

సింహరాశి: అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు!

అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పులను ఎదుర్కొంటారు. గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరకదు. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. చాలా ఉత్సాహంగా ఉంటారు.

కన్యరాశి: వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి!

వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. గృహమున కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు. కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. వచ్చిందనాటి స్నేహితులను కలుసుకొని పాత విషయాలు జ్ఞాపకం చేసుకుంటారు. మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

తులరాశి: నిరుద్యోలకు ఉద్యోగ అవకాశం ఉంటుంది!

నిరుద్యోగులకు ఉద్యోగం అవకాశం ఉంటుంది. కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

వృశ్చికరాశి: మీ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు!

మీ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. భూమికి సంబంధించిన విషయాల్లో మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. దూరపు బంధువుల నుండి ఆహ్వానాల అందుతాయి. భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

ధనుస్సురాశి: మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది!

మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది. ప్రారంభించిన పనులు చాలా నిదానంగా పూర్తి చేస్తారు. మీ చిన్ననాటి స్నేహితుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది. ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి. లేదంటే కొన్ని ఇబ్బందులనే ఎదుర్కొంటారు.

మకరరాశి: ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది. కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారు దూర ప్రయాణాలను వాయిదా వేయాలి. మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. మీ పాత స్నేహితులను కలుసుకుంటారు. వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

కుంభరాశి: కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు!

కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చ చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది. చాలా ఉత్సాహంగా ఉంటారు

మీనరాశి: కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది!

కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది. మీ స్నేహితులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవ సేవ కార్యక్రమాలు పాల్గొంటారు. అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.