తాజాగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ 2021- 22 ఐటీ వార్షిక నివేదికను హైటెక్ సిటీలో టెక్ మహీంద్రా కార్యాలయంలో విడుదల చేయగా అందులో హాజరయ్యారు. ఇక అక్కడి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కోవిడ్ తర్వాత ఎన్నో రంగాలు సాధారణస్థితికి రావడానికి ఎన్నో అవస్థలు పడుతున్నాయని.. కానీ తెలంగాణ ఐటీ రంగం మాత్రం శరవేగంగా దూసుకుపోతుందని అన్నారు.
ఇక ఈ ఏడాది మంచి ఫలితాలను అందించిందని ఉంటున్నారు. దేశంలో 4.5 లక్షల ఉద్యోగాలు వస్తే హైదరాబాదులో లక్షన్నర వచ్చాయని అన్నారు. ఇక తెలంగాణలో ఐటి ఉద్యోగుల సంఖ్య 7,78,121 గా ఉన్నాయని, ఎనిమిది ఏళ్లలో 4.1 లక్షల ఐటి ఉద్యోగాలు వచ్చాయి అని అన్నారు. మరో రెండు నెలల్లో టీ వర్క్స్ కొత్త ఫెసిలిటీ ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని తెలిపారు.