Kanagal: భార్య మాంసం ఉండలేదని 100 కు డయల్.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా..?

Kanagal: సాధారణంగా భార్య భర్తలు అన్నాక వస్తూ పోతూ ఉంటాయి. భార్య భర్తల మధ్య గొడవలు అన్నది సహజం. కొద్దిసేపు పోట్లాడుకుంటారు మరి ఇద్దరూ ఒకటవుతారు. కానీ కొన్ని కొన్ని సార్లు భార్య భర్తల మధ్య గొడవలు చిలికి చిలికి గాలివానలా మారుతూ ఉంటాయి. భర్త తాగి వచ్చి భార్యలు నాన్న మాటలు అనడం, అంతేకాకుండా అనవసరంగా మానసికంగా శారీరకంగా హింసించడం, అలాగే మద్యం చేయించినప్పుడు వాళ్ళు అడిగినది చేసి పెట్టలేదు అని వీరంగాలను సృష్టిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరు మందుబాబులు భార్యను చంపడానికి అయినా వెనుకాడరు.

మద్యం మత్తులో ఏం చేస్తున్నారు కూడా తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఇద్దరు భార్యాభర్తలు పోట్లాడుకొని భర్త అడిగినది భార్య చేసిపెట్టలేదని ఆ భార్య పై ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. చర్ల గౌరా రానికి చెందిన ఓర్సు నవీన్ అనే యువకుడు హోలి పండుగ రోజున మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలోనే తన భార్య తనకు మాంసం వండి పెట్టలేదు అని నానా హంగామా చేశాడు. అయినా ఆమె మాంసం వండకపోవడంతో మద్యం మత్తులో 100 కు ఆరు సార్లు కాల్ చేసాడు.

మద్యం మత్తులో అతను మొదటి రెండు మూడు సార్లు కాల్ చేసిన రెస్పాండ్ కాకపోయే సరికి ఏకంగా ఆరు సార్లు చేశాడు. పోలీసులు సమాచారం మేరకు అక్కడికి చేరుకోగా తన భార్య తనకు మాంసం వండి పెట్టలేదు అని అక్కడికి వచ్చిన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసుల సమయాన్ని వృధా చేసినందుకు అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యవసర సేవలు మినహా ఆపద సమయంలో మాత్రమే 100 కి కాల్ చేయాలని అనవసరంగా ఫోన్ చేసి పోలీసుల సమయాన్ని వృధా చేసినందుకుగాను అతనిపై చర్యలు తీసుకుంటాము అని ఎస్సై నగేష్ తెలిపారు.