అలనాటి ప్రముఖ నటి ఐశ్వర్య భాస్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దాదాపు రెండు వందలకు పైగా సినిమాలలో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఐశ్వర్య ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక డబ్బు కోసం నానా అవస్థలు పడుతోంది. ఇటీవల సమంత ప్రధాన పాత్రలో నటించిన ఓ బేబీ సినిమాలో నాగశౌర్య తల్లి పాత్రలో నటించింది. అటు వెండి తెర మీద మాత్రమే కాకుండా బుల్లితెర మీద కూడా పలు సీరియల్స్ లో నటించిన ఐశ్వర్య చేతిలో ప్రస్తుతం ఒక్క అవకాశం కూడ లేదు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ వారు నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య తన దుర్భర పరిస్థితుల గురించి తానే స్వయంగా చెప్పుకొచ్చింది.
తమిళం యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఐశ్వర్య భాస్కర్ మాట్లాడుతూ..తన ఆర్థిక పరిస్థితుల గురించి వివరిస్తూ కన్నీరు పెట్టుకుంది. ఒకప్పుడు వరుస సినిమాలలో నటించిన నేను ఇప్పుడు అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం చేతిలో పని లేక డబ్బు కోసం వీధుల్లో సబ్బులు అమ్ముకుంటూ బ్రతుకుతున్నాను. ఉన్న ఒక్క కూతురూ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు నా ఫ్యామిలీలో నేను మాత్రమే ఉన్నాను. ప్రస్తుతం నేను స్వతంత్రంగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను.
ప్రస్తుతం నాకు అప్పులు లేవు..కానీ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఏదో ఒక పని చేయాలి కదా. అందుకే ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ.. సబ్బులు అమ్ముకుంటున్నాను. ఇప్పుడు నేను పని చేయటం చాలా అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పనిచేయడానికైనా నేను వెనుకాడను. అవసరమైతే టాయిలెట్స్ కూడా క్లీన్ చేయటానికి సిద్దంగా ఉన్నా అని ఐశ్వర్య చెప్పుకొచ్చారు. ‘నటిగా నా కెరీర్ ప్రారంభించిన మూడు సంవత్సరాల పాటు బాగా సాగిపోయింది. ఆ తరువాత పెళ్లి చేయడంతో క్రమంగా ఇండస్ట్రీకి దూరం కావల్సి వచ్చింది. ప్రస్తుతం నేను ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాను. ఇప్పుడు ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి ఒక మెగా సీరియల్ ఆఫర్ రావాలి అంటూ ఐశ్వర్య ఆమె పరిస్థితిని చెప్పుకొచ్చారు.