మనిషి పుట్టినప్పుడు ఆ పుట్టిన వాడికి తాను ఏ కులంలో పుట్టానో తెలియదు.. కానీ ఎదిగే కొద్ది సమాజం వాడి కులాన్ని కొన్ని వందల సార్లు గుర్తుకు తెస్తుంది.. చిన్నప్పుడు చదువుకోవడానికి వెళ్లగా అక్కడ మొదలైన కులప్రస్తావన చచ్చేదాక వెంటాడుతూనే ఉంటుంది.. ఈ కులమే డబ్బును శాసిస్తుంది, మనిషిని శాసిస్తుంది.. చివరికి ప్రజలకు సేవచేసే వాళ్లు పెట్టుకున్న పేరు రాజకీయం.. దీంట్లో కూడా కులమే.. అందుకే అంటారు కుల గజ్జి తగిలితే ఒక పట్టాన వదిలిపెట్టదని.. ఇక ఏపీ రాజకీయాల్లో ఈ కుల రాజకీయమే రాజ్యమేలుతుందట.. ఆ విషయాన్ని గమనిస్తే..
ఏపీలో దళితులపై దాడులు జరుగుతున్నాయని, వారి సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రతిపక్షం పదే పదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.. కానీ ఇక్కడ ఎవరు అధికారంలో ఉన్న దళితుల సంగతి పక్కన పెడితే అదే సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉన్నాయంటున్నారు.. ఇక రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దళిత ఎమ్మెల్యే అక్కడి అగ్రవర్ణాల చేతుల్లో ఉండాల్సిందనట.. ఏ మాత్రం స్వతంత్రంగా వ్యవహరించినా వారికి చుక్కలు కన్పించేలా చేస్తారట.
ఇకపోతే చంద్రబాబు హయామంలో గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న రావెల కిశోర్ బాబును అక్కడి అగ్రవర్ణాలు మంత్రి వర్గం నుంచి తప్పించాయి. ఇతనే కాకుండా మరికొందరు దళిత నాయకులు కూడా రాజకీయ ర్యాగింగ్ బారిన పడ్దారట.. కాగా ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ తాము దళిత పక్షపాతని చెప్పుకుంటున్నా ఎస్సీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పరిస్థితి ఏమాత్రం బాగా లేదట. నందికొట్కూరు నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యే ఆర్థర్, సిద్ధార్ధరెడ్డికి మధ్య గత పదిహేడు నెలలుగా విభేధాలున్నాయి. ఇప్పటికి పరిష్కారం కాలేదు..
ఇదే జిల్లాలోని కోడుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్, కోట్ల హర్షవర్ధన్ రెడ్డిలకు మధ్య విభేదాలు తీవ్ర మయ్యాయి. ఇక పాయకరావుపేటలో సీనియర్ నేత, ఎమ్మెల్యే గొర్ల బాబూరావు పరిస్థితి కూడా ఇలాగే ఉందట.. ఈ నేపధ్యంలో వైసీపీలోని దళిత నాయకులు కొందరు తమ సమస్యలు వైఎస్ జగన్ విని పరిష్కరించిన తర్వాతే తదుపరి పనులు చేసుకోవాలని లేదంటే వచ్చే ఎన్నికల నాటికి వేరే పార్టీ చూసుకోవాల్సి ఉంటుందని సంకేతాలు అందిస్తున్నారట.. మరి ఇలాంటి బెదిరింపులు కామనే అని అనుకుంటారా.. లేదా వీరికి న్యాయం చేస్తారా అనేది తెలియాలంటే వేచి ఉండవలసిందే..