ఆయన ఒకప్పుడు సెన్సేషనల్ సినిమాలు తీసిన నిర్మాత. సక్సెస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా ఆయన పేరు చెప్పేవారు. అవును నిజమే ఆయన నిర్మాణంలో వచ్చిన సినిమాలు ఆ స్థాయిలోనే వుండేవి మరి. ఎప్పుడైతే ‘దర్శకత్వం’ అనే దోమ కుట్టిందో, ఆ తర్వాత కథ పూర్తిగా మారిపోయింది. ఆ పైత్యం కారణంగానే తన ఇమేజ్ చెడగొట్టుకున్నారా పెద్దాయన. అక్కడితో ఆగితే ఫర్వాలేదు.
ఆ పెద్దాయనకు ఓ ముద్దుల తనయుడు. హీరోగా సత్తా చాటగల ప్రతిభా పాఠవాలున్న దమ్మున్నోడు. కానీ ఏం లాభం.? కాలం కలిసి రావడం లేదు సరికదా.. తండ్రి పైత్యం ఇప్పుడు కుమారుడి కెరీర్‌ని కూడా దెబ్బ తీస్తోంది. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. కానీ, ఎందుకు చేస్తున్నాడో అసుల ఏం సినిమాలు చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితుల్లో వున్నాడట ఆ తనయుడు. వచ్చిన ప్రతీ సినిమా ఫెయిల్ అవుతోంది. కంటెంట్ వుంటేగా మరి. గట్టిగా చెప్పాలంటే, యంగ్ హీరోల రేసులో సత్తా చాటగల నటనా ప్రతిభ వున్నోడు. కానీ, కథల ఎంపిక దగ్గర్నుంచి, అన్ని విషయాల్లోనూ తండ్రి జోక్యం. దాంతో, బొత్తిగా కంటెంట్ లేని కథలతో బోర్ కొట్టించేస్తున్నాడు.
తన కెరీర్‌లో ఎన్నో మంచి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఆ పెద్దాయన కొడుకు కెరీర్‌ని దారిలో పెట్టగల మంచి సినిమాని సెలెక్ట్ చేయలేకపోవడం నిజంగా దారుణం. పోనీ, ఆ తనయుడేమంత తక్కువోడు కాదు. తన కథలను తన బాడీలాంగ్వేజ్‌కి సెట్ అవ్వగల కంటెంట్‌నీ సెలెక్ట్ చేసుకోగల సత్తా వున్నోడే. వచ్చిన చిక్కల్లా.. తండ్రి మాట జవదాటలేని నైజం.. అలా అడుగడుగునా అడ్డం పడుతూ, చేజేతులారా కొడుకు కెరీర్‌ని దెబ్బ తీస్తున్నాడా ఇండస్ర్టీ పెద్ద మనిషి.