ప్రస్థుత కాలంలో అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. కొంతమంది తల్లిదండ్రులు క్షణికా వేశానికిలోనే తమ బిడ్డల ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా ఇటువంటి దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. తన ప్రేమని వదులుకోమని పలుమార్లు కూతురిని హెచ్చరించిన తండ్రి ఆమె మాట వినకపోవడంతో హత్య చేయడానికి పాల్పడ్డాడు.
వివరాలలోకి వెళితే… ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నవీన్ కుమార్ అనే వ్యక్తి తన కూతురు ప్రేమ విషయం తెలిసి ఆ ప్రేమని వదులుకోమని పలుమార్లు హెచ్చరించాడు అయినా ఆమె మాట వినకపోవడంతో విచక్షణారహితంగా ఆమె ప్రాణాలు తీయటానికి కూడా వెనుకాడ లేదు. వార్డ్ బాయ్ నరేష్ కుమార్ అనే వ్యక్తితో కలిసి తన కూతుర్ని హత్య చేయడానికి పథకం వేశాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి నవీన్ కుమార్ తన కూతురిని కంకర్‌ఖేడా లోని ఆసుపత్రిలో తీసుకెళ్లి కోతుల బెదిరింపులకు స్పృహ తప్పి పడిపోయిందని డాక్టర్లకి చెప్పి ఆసుపత్రిలో చేర్పించాడు. ఆ తర్వాత కొన్ని గంటలకు ఆమెను మోడీపురంలోని ఫ్యూచర్ ప్లస్ ఆసుపత్రికి తరలించారు.
కొంత సమయం తర్వాత అకస్మాత్తుగా యువతి ఆరోగ్యం క్షీణించిందని డాక్టర్లు వెల్లడించారు.ఆమెకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా అధిక మోతాదులో పొటాషియం క్లోరైడ్ ఇంజక్షన్ చేయటం వల్ల ఆమె ఆరోగ్యం క్షీణించిందని వెల్లడయింది. దీంతో డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. ఈ క్రమంలో వార్డు బాయ్ నరేష్ కుమార్ ఐసీయూలోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు నరేష్ కుమార్ ని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా నవీన్ కుమార్ తనకు లక్ష రూపాయలు ఇచ్చి తన కూతుర్ని చంపమని చెప్పినట్లు అంగీకరించాడు.
దీంతో నరేష్ కుమార్ డాక్టర్ లాగా మారువేషంలో ఐసీయూలోకి ప్రవేశించి అధిక మోతాదులో పొటాషియం క్లోరైడ్ ఆమెకు ఇంజక్షన్ చేసినట్లు నేరం అంగీకరించాడు. ఈ క్రమంలో పోలీసులు నవీన్ కుమార్ ని విచారణ చేయగా తన కూతురికి వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని దాన్ని మానుకోమని ఎన్నిసార్లు చెప్పినా ఆమె నిరాకరించడంతో ఇలా హత్య చేయటానికి ప్రయత్నం చేసినట్లు నవీన్ కుమార్ నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు నవీన్ కుమార్ మీద కేసు నమోదు చేసుకొని ఈ ఘటనపై మరింత సమాచారం కోసం లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా నరేష్ కుమార్ దగ్గర 90 వేల రూపాయల నగదు తో పాటు విరిగిన ఇంజక్షన్ కూడా స్వాధీనం చేసుకున్నారు.