Prabhas: ఆదిపురుష్ విడుదల విషయంలో ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్న దర్శకుడు.. వర్కౌట్ అయ్యేనా?

Prabhas: నిన్న శివ రాత్రి సందర్బంగా ఆదిపురుష్ సినిమా రిలీజ్ తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదిన సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఆదిపురుష్ మైతలాజికల్ వండర్ గా 3డి చిత్రంగా తీశారు.

ఓంరౌత్ ఈ చిత్రానికి డైరెక్టర్ కాగా సినిమాను తొలుత ఆగష్టు 11 న రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ భావించినా కుదరలేదు. దీంతో అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. ఆ సినిమా ను ఆగష్టు 11 న రిలీజ్ చేయనున్నారు.

ఇక వాయిదా పడిన ఆదిపురుష్ ఒక రెండు మూడు వారాలు వాయిదా పడిన మళ్ళీ రిలీజ్ డేట్ ప్రకటిస్తారని అందరు భావించారు. ఇక దీపావళికి సినిమా విడుదల చేస్తారనే పుకార్లు వినిపించాయి. కానీ అందరిని ఆశ్చర్యపరుస్తూ సినిమాను ఏకంగా జనవరి 12 2023 న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.జనవరిలో విడుదల చేయడానికి ఒక బలమైన కారణం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. డైరెక్టర్ ఓంరౌత్ చేసినవి ఆదిపురుష్ తో సహా మూడు సినిమాలకి దర్శకుడి గా వ్యవహరించారు. మొదటి సినిమా స్వాతంత్ర సమరయోధుడు లోకమాన్య బాలగంగాధర తిలక్ గురించి లోకమాన్య సినిమాను మరాఠిలో దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2015 జనవరి 2న విడుదలయి దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చింది.

ఇక రెండవ సినిమా తానాజీ అజయ్ దేవ్ గన్ తానాజీ గా రూపొందించారు. ఇందులో ప్రతినాయకుడిగా సైఫ్ ఆలీ ఖాన్ నటించారు. ఈ సినిమా కూడా జనవరి 10వ తేదీ 2020 న రిలీజ్ అయి ఓం రౌత్ కి ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చింది. అందుకే ఇపుడు తన మూడవ సినిమా ఆదిపురుష్ ని కూడా జనవరి రిలీజ్ చేయాలనీ డేట్ లాక్ చేసారని బాలీవుడ్ గుసగుసలాడుతోంది. అయితే గత రెండు సినిమాలు విజయం అందుకున్న విధంగానే ఈ సినిమా కూడా వర్కౌట్ అవుతుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.