కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వైకాపా ప్రభుత్వం రాష్ర్టంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రజలకు తెలిసిందే. ఎక్కడిక్కడ వైరస్ ని కట్టడి చేయడంతో ప్రభుత్వం విజయవంతగా పనిచేస్తోంది. బాధితులకు..డాక్టర్లకు ఎలాంటి అసౌకర్యంగా కల్గకుండా ప్రత్యేక ప్యాకేజీ కేటాయించి ముందుకెళ్తోంది. అలాగే సామన్య ప్రజానీకానికి బియ్యం సహా ఇతర నిత్యావసరాలు ఎప్పటికప్పుడు అందిస్తోంది. అయితే టీడీపీ నేతలు మహమ్మరి కరోనా వైరస్ పై కూడా నీచమైన రాజకీయాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. దేశంలో-రాష్ర్టంలో పరిస్థితులు బాగోకపోయినా టీడీపీ పనికమాలిన రాజకీయాలు చేసి పరువు తీసుకుంటోంది.
తాజాగా మంత్రి వెల్లంపల్లి టీడీపీ కరోనా రాజకీయాలను ఎండగట్టారు. ద్వారావతి పౌండేషన్ ఆధ్వర్యంలో వలస కూలీలకు నిత్యావసర సరుకులను మంత్రి పంపిణీ చేసారు. సామాన్య ప్రజలపై ఆర్ధిక భారం వేసే పనిని తమ ప్రభుత్వం చేయదన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్త శుద్దితో పరిపాలిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా తెలుగు దేశం పార్టీ కళ్లు తెరిచి వాస్తవ పరిస్థితులను చూడాలని..కుళ్లు రాజకీయాలు మనేయాలని హితవు పలికారు. ఇప్పటికే టీడీపీ కరోనా వైరస్ పై చేసిన రాజకీయాలపై పలువురు నేతలు, కార్యకర్తలు ఎండగట్టిన సంగతి తెలిసిందే.
అప్పుడప్పుడు కేంద్రం లో విపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలా వ్యవరించాలని టీడీపీకీ సూచించారు. కరోనా మహమ్మారి భారత్ ని చుట్టేస్తోన్న సమయంలో ఎన్డీఏకు అండంగా కాంగ్రెస్ నిలిచిన సంగతి తెలిసిందే. ప్రధాని చర్యలను సమర్ధిస్తు కాంగ్రెస్ కొన్ని పాజిటివ్ ట్వీట్లను చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ విపక్ష హోదాలో స్వరం మార్చినప్పటికీ..చేస్తోన్న విమర్శల్లో ఓ అర్ధం ఉంది. కానీ ఏపీ విషయంలో టీడీపీ పనికమాలిన మాటలు తప్ప…పనికొచ్చే పనులు ఒకటీ చేయలేదు. కనీసం ఇప్పటకైనా కళ్లు తెరవాలని పలువురు హితవు పలికారు.