మీడియా అనేది ప్రస్తుతం రాజకీయాలను ప్రభావితం చేయటంలో కీలక భూమిక పోషిస్తుంది. అందుకే ప్రతి రాజకీయ పార్టీ సొంత మీడియా లేదా తమకు అనుకూల మీడియా ఉండేలా పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆయా మీడియా ఛానల్స్ ఆ రాజకీయ పార్టీని లైమ్ లైట్ లో ఉండేలా చూడటంతో పాటుగా, అవసరానికి తగ్గట్లు ప్రత్యూర్ది పార్టీలను టార్గెట్ చేస్తూ, వాళ్ళ గురించి ఉన్నవి లేనివి ప్రజల్లోకి తీసుకోని వెళ్తుంటాయి.
ఇప్పుడు ఆంధ్రాలో కొన్ని మీడియా సంస్థలు అదే పని చేస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ -జనసేన పార్టీల గురించి గత రెండు మూడు రోజుల నుండి అనేక వరస కధనాలు టెలికాస్ట్ చేస్తున్నాయి. 2019 ఎన్నికల సమయంలో అటు బీజేపీకి ఇటు జనసేనకు కనీసం ఐదు నిమిషాల స్లాట్ కేటాయించలేని ఆయా చానెల్స్ ఇప్పుడు గంటలు గంటలు అదే పనికి ఆ రెండు పార్టీల గురించి ఎందుకు చెపుతున్నాయాయి..?
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ- జనసేన పార్టీలు అనూహ్యంగా తెరమీదకు దూసుకొని వచ్చాయి. తెలంగాణలో వరస విజయాలు ఇచ్చిన ఊపులో బీజేపీ, తిరుపతిలో బలమైన కార్యకర్తలు ఉండటంతో జనసేన రెండు కూడా ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోని ప్రచారం చేస్తున్నాయి. దీనితో కంగారు పడిన సదురు మీడియా చానెల్స్ ఆ రెండు పార్టీలకు చెందిందని. ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారని, బిజెపి జనసేన మధ్య మిత్ర భేదం తలెత్తిందని వార్తలు ప్రసారం చేస్తున్నారు.
దీనితో కొందరు జనసైనికులు ఈ వార్తల ట్రాప్ పడిపోయి బీజేపీ మీద సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోయటం జరుగుతుంది. అటు బీజేపీ శ్రేణులు కూడా జనసేన మీద కౌంటర్లు వేస్తున్నారు. అయితే ఈ రకంగా వార్తలు ప్రసారం చేయటం వలన ఆయా మీడియా చానెల్స్ కు వచ్చే లాభం ఏమిటయ్యా అంటే..? జనసేన మరియు బీజేపీ మధ్య గ్యాప్ వస్తే అందులో దూరి బీజేపీ కి మద్దతు ఇచ్చి మరోసారి కాషాయ పార్టీతో చెలిమి చేయాలనీ చంద్రబాబు భావిస్తున్నాడు. ఆయన్ని బీజేపీకి దగ్గర చేయాలని బాబు అనుకూల మీడియా గత ఏడాది కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు బీజేపీ మరియు జనసేన మధ్య ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.