Pawan Kalyan: తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయన చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన మాత్రం తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా నటుడిగా కొనసాగుతూనే రాజకీయాలలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటూ కేవలం రాష్ట్రస్థాయిలో మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా తన విధులను ఎంతో సక్రమంగా నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే అధికారం మదంతో ఎవరైనా అధికారులు పనిచేసిన వారి పవర్ కట్ చేస్తూ ఉంటారు అలాగే ఎప్పటికప్పుడు అభిమానులకు కార్యకర్తలకు తన పార్టీ నేతలకు కూడా ఈయన దిశా నిర్దేశాలు చేస్తూ ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ ఇంత మంచి సక్సెస్ అందుకోవడానికి కారణం ఆయనలో ఉన్నటువంటి ఒక గుణమే కారణమని చెప్పాలి.
పవన్ కళ్యాణ్ ఎదుటివారు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును తన మనసులోనే దాచుకోరు. వారు చేస్తున్న తప్పును నిర్మొహమాటంగా బయట పెడుతూ ఉంటారు. ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఇలా ఎదుటివారి తప్పులను చెప్పటానికి ఇష్టపడరు.ఇండస్ట్రీలో చాలామంది ఆ వ్యక్తి తప్పు చేశాడు అని బయట పెడితే ఎక్కడ తమ పేరుపై నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతుందో అని భయపడుతూ ఉంటారు.
ఇలా ఏ విషయం గురించైనా నిజాయితీగా నిర్మొహమాటంగా మాట్లాడే వారిలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉండగా ఆయన తర్వాత అలా ఏ విషయం గురించి అయినా ఓపెన్ గా చెప్పే వ్యక్తిత్వం నాచురల్ స్టార్ నానికి మాత్రమే ఉందని చెప్పాలి.ఎక్కడైనా అన్యాయం జరిగింది అని తెలిస్తే మొదటిగా హీరో నానినే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తారు. ఇక కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయంలో కూడా అందరికంటే మొదటగా రెస్పాండ్ అయ్యింది నానినే. అల్లు అర్జున్ విషయంలోనే కాదు ఎన్నో విషయాలలో కూడా తప్పును ప్రశ్నిస్తూ నాని మాట్లాడుతూ ఉంటారని అలాంటి ధైర్యం పవన్ తర్వాత నానీకే ఉందని అభిమానులు భావిస్తుంటారు.