సురేఖ వాణి జీవితంలో ఆ విషాదం.. తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

సురేఖ వాణి ఒక తెలుగు సినీ నటి. తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువగా సహాయ పాత్రలలో నటించింది. ఈమె 1981 లో విజయవాడలో జన్మించింది. ఈమె సురేష్ తేజ ను వివాహం చేసుకుంది. ఈయన పలు టీవీ షోలకు, సినిమాలకు దర్శకత్వం వహించాడు. సుప్రియ అనే అమ్మాయి సంతానం. చదువుకునేటప్పుడే సురేఖ అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేది.

ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడు విజయవాడలోని ఓ ప్రాంతీయ చానల్లో చిన్నపిల్లల కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహరించింది. ఇక ఇంటర్మీడియట్ తర్వాత పూర్తిస్థాయి వ్యాఖ్యతగా మారింది. వివాహం తర్వాత మాటీవీలో భర్తతో కలిసి మా టాకీస్, హార్ట్ బీట్ అనే కార్యక్రమాలను, భర్త దర్శకత్వం వహించిన మొగుడ్స్ పెళ్ళామ్స్ కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహరించింది.

ఈ కార్యక్రమం ద్వారానే సురేష్ తేజ తో పరిచయం కాస్త ప్రేమగా ఏర్పడింది. కుటుంబ సభ్యులు కులాంతర వివాహం అని అడ్డు చెబితే రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఇక భర్త, సురేఖ ఎవరి కెరీర్లో వారు బిజీగా ముందుకు సాగారు. ఈ కార్యక్రమం ద్వారా పాపులర్ అయిన సురేఖ సినిమాలలో చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు దాదాపు అందరి సినిమాల్లోనూ సహాయ పాత్రలో నటించింది.

సురేఖ వాణి తెలుగు,తమిళ భాషల్లో దాదాపు 80 వరకు చిత్రాలలో నటించింది. ఇలా సాఫీగా సాగుతున్న ఈమె జీవితంలో తీరని విషాదం చోటుచేసుకుంది. భర్త అనారోగ్యం పాలు కావడం. ఆయన చనిపోవడం తీరని లోటు. భర్త అనారోగ్య విషయం తన వద్ద దాచిపెట్టడం ఆమె జీర్ణించుకోలేకపోయింది.

భర్త చనిపోయాక కూతురు సుప్రియ ను చూసుకుంటూ, బాధను దిగమింగుకొని హైదరాబాదులో స్థిరపడి సినిమాలలో వచ్చే అవకాశాలను వాడుకుంటూ ముందుకు సాగుతుంది. మొత్తానికి భర్త చనిపోయాక కుటుంబ బాధ్యతలను మోస్తూ, పిల్లలను ఏ లోటు లేకుండా చూసుకోవాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం బాగా యాక్టీవ్ గా మారింది. సోషల్ మీడియాలో మాత్రం బాగా హల్ చల్ చేస్తుంది.