Hema: ఒక టాప్ కమెడియన్ తన పక్కన నటించకుండా నన్ను రిజెక్ట్ చేశాడు.. నటి హేమ కామెంట్స్!

Hema: కెరీర్ పరంగా దెబ్బతీయడానికి తన అసిస్టెంట్ డైరెక్టర్లే, డైరెక్టర్లయ్యారని సినీ నటి హేమ అన్నారు. ఒక టాప్ మోస్ట్ కమెడియన్ ఒకతను తన పక్కన నటించేందుకు హేమ వద్దు, వేరొకరిని రికమెండ్ చేశారని అని అన్నారని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఆ డైరెక్టర్ తనకు ఫోన్ చేసి ఏంట్రా ఒక కమెడియన్ ఇలా అంటున్నాడు, మీ మధ్య ఏమైనా గొడవ లాంటివి ఏమైనా అయిందా అని తనను అడిగిన‌ట్టు ఆమె చెప్పారు. లేదు, నాకు తెలియదు అని దానికి ఆమె సమాధానం ఇచ్చినట్టు హేమ తెలిపారు.

ఆ తర్వాత తానే డైరెక్ట్‌గా వెళ్లి ఆ వ్యక్తిని కలిసి, నీకు నాకు ఏమైనా ప్రాబ్లమ్ ఉందా, నేను బాగా యాక్ట్ చేయట్లేదా అని అడిగానని ఆమె చెప్పారు. దానికి ఆయన లేదురా అలాంటిదేం లేదు అని ఆతను సమాధానిచ్చినట్టు ఆమె తెలిపారు. అలా ఆ సమయంలో ఒక సన్నివేశం జరిగిందని ఆమె అన్నారు. ఆ డైరెక్టర్ తనకు తెలిసిన వాడు, మంచి పరిచయం ఉంది కాబట్టి వాళ్లు అన్యాయం చేద్దామనుకున్నా తనకు చెప్పేశారని, అంతే కాకుండా వాళ్లు వద్దన్న సినిమాల్లో తానే నటించానని ఆమె చెప్పారు.

ఇకపోతే తన క్లోజ్ ఫ్రెండ్ డేట్స్ ఇవ్వకపోతే, తాను కూడా డేట్స్ ఇచ్చేదాన్ని కాదని హేమ అన్నారు. అలా రెండు, మూడు సినిమాల్లో తనకు రికమెండ్ చేసి, తనతో పాటు ఉండి ఎప్పుడైనా తనకు డేట్స్ లేకపోతే చెప్పు నేను చూసుకుంటా కదా అని ఉండే ఒక ఫ్రెండ్, తన వెనకాల తనను తిడుతుందని ఆమె చెప్పారు. ఒకప్పుడు వాళ్లే ఎందుకు దానికే వేషం ఇస్తారు, అది రారా పోరా అంటది, మనుషుల్ని లెక్కనే చెయదు, మీకు అదే కరెక్ట్ ఇలాంటి మాటలు అనడం వల్ల ఒక్కసారి కాకపోయినా మరోసారైనా తనకు నష్టమే కలుగుతుంది కదా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలా నష్టపోయిన సందర్భాలూ ఉన్నాయని, లోకేషన్‌లోనూ ఇలా ఆమె అన్నదని తనకు చెప్పిన సంఘటనలూ ఉన్నాయని హేమ తెలిపారు. కానీ తనను ఎప్పుడూ దాని గురించి అడగలేదని, కానీ ఆమె అంటే తనకు చాలా ఇష్టమని హేమ తన భావాన్ని వ్యక్తం చేశారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిందని, ఆ తర్వాత ఒకానొక రోజు తనతో ఉండే వాళ్లే వెన్నుపోటు పొడిస్తే మళ్లీ తన దగ్గరే ఆమె వచ్చి, నా వల్లే ఇలా అయింది, అపార్థం చేసుకున్నానని చెప్పినట్టు హేమ వివరించారు.