మాజీ కాంగ్రెస్ నేత, నిర్మాత బండ్ల గణేష్ మాటలు కోటలు దాటుతాయని అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో తెలంగాలో కాంగ్రెస్ పార్టీలో చేరిన గణేష్ సంచలన వ్యాఖ్యలతో మీడియానే షేక్ చేసిన ఘనాపాటి. కాంగ్రెస్ ఓడిపోతే 7 ఓ క్లాక్ బ్లేడ్…కంటం తెగిపడు తుంది. టీఆర్ ఎస్ కి అంత దమ్ముందా? అంటూ సవాల్ విసిరి చివరికి ఫలితాలు వచ్చేసరికి పత్తాలేకుండా పోయాడు. ప్రస్తుతం మళ్లీ సినీ నిర్మాతగా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవలే కరోనా మహమ్మారిని జయించి ఇంటికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో గణేష్ ఏపీ రాజకీయాల పై ఆసక్తికర కామెంట్లు చేసారు.
తన దేవుడు పవన్ కళ్యాణ్ సినిమాల గురించి మాట్లాడగలను గానీ…రాజకీయాల గురించి మాట్లాడలేను అంటూనే ఆయనకు చురకలు అంటించాడు. జనసేన పార్టీకి ఒక్క సీటే రావడం..పవన్ రెండు చోట్లా ఓడిపోవడం చాలా బాధగా అనిపిచించింది. గెలిస్తే బాగుండేది. కానీ ఆయన పార్టీ ఓడిపోతుందని ముందే తనకి తెలసునని జోస్యం చెప్పాడు. వైసీపీ 130 సీట్లు గెలుస్తుందని ఢిల్లీలో తనకు ఉన్న లగడపాటి మధు అనే ఫ్రెండ్ చెప్పినట్లు బండ్ల గణేష్ తెలిపాడు. ఎన్నికల ఫలితాలపై మధు కి మంచి అవగాహన ఉందిట. వైసీపీ కి అన్ని సీట్లు, జనసేన ఓటమి, లోకేష్ ఓడిపోతారని ఆయన ముందే చెప్పారని బండ్ల గణేష్ అన్నాడు.
లోకేష్ సీఎం అవుతాడో ? లేదో ? తెలియదు గానీ.. తనకి అవకాశం వస్తే కచ్చితంగా అవుతానని..కుదరకపోతే తన కొడుకైనా సీఎం చేస్తానని బండ్ల గణేష్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతానికి ఏ పార్టీలో లేను. సినిమాలే కంటున్యూ చేస్తానని గణేష్ తెలిపాడు. అయినా గణేష్ ఎప్పుడో ముగిసిపోయిన ఈ కథని మళ్లీ ఇప్పుడెందుకు తవ్వుతున్నట్లు. పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇవ్వలేదని ఇలా మీద పడ్డాడా? లేక వేరే పార్టీపై ఉన్న కోపమా? ఈ ఎపిసోడ్ లో మొత్తంగా గణేష్ మద్దతైతే వైసీపీకి ఉందని తెలుస్తోంది.