ఆ వ్యక్తి నన్ను కొట్టాడు.. పర్సు లాక్కున్నాడు: కంగనా రనౌత్

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం థాకడ్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా త్వరలో విడుదల కానున్న సందర్భంగా ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. అలా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని విషయాలు పంచుకుంది. గతంలో తాను యూరప్ ట్రిప్ లో భాగంగా ఇటలీ- స్విట్జర్లాండ్ బోర్డర్ కు వెళ్లగా.. అక్కడ రహస్యంగా కొంతమంది జీవిస్తుండటంతో.. వాళ్ళని చూసి భయపడి దగ్గర్లో ఉన్న మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్లిందట.

ఇక అక్కడ ఒక వ్యక్తి తనను కొట్టిన.. తన పర్సు లాక్కున్నాడు అని.. అందులో కొన్ని వేల డాలర్స్ తో పాటు కార్డ్స్ కూడా ఉన్నాయి అని.. ఆ తర్వాత ట్రైన్ ఎక్కి చూస్తే పర్సు ఖాళీగా ఉందని తెలిపింది. ఆ సమయంలో తన దగ్గర ఒక్క పైసా కూడా లేదు అని పైగా కొత్త ప్రదేశమని.. ఇక తన సోదరికి ఫోన్ చేయటంతో తన మేనేజర్ ను పంపిందని తెలిపింది.