ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో బాలీవుడ్ సినిమా అంటేనే కచ్చితంగా హిట్ అయ్యేది. కానీ ఇపుడు పరిస్తితి మారిపోయింది. కానీ బాలీవుడ్ లో సరైన హిట్ లేక చాలా కాలమయ్యింది. ప్రస్తుతం నార్త్ ఇండస్ట్రీలో కూడా సౌత్ సినిమాల హవా నడుస్తోంది. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలోని హీరో హీరోయిన్లు బాలీవుడ్ లో సినిమా అవకాశాల కోసం ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు సైతం సౌత్ ఇండస్ట్రీలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా రేంజ్ ప్రపంచ వ్యాప్తంగా పాకిపోయింది. ఇటీవల విడుదలైన కొన్ని సౌత్ సినిమాలు నార్త్ లో భారీ వసూళ్లు సాధించాయి .
అయితే సౌత్ సినిమాలను డామినేట్ చేసే బాలీవుడ్ సినిమాల పరిస్థితి ఇప్పుడు ఇలా దారుణంగా మారటం పై దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్పందించారు. ఈ విషయం పై అనురాగ్ స్పందిస్తూ..బాలీవుడ్ సినిమాలు ప్లాప్ కావటానికి ముఖ్య కారణం భాష. ఇక్కడ హింది భాష మాట్లాడటానికి రాని వాళ్ళు సినిమాలు తీయటం వల్ల బాలీవుడ్ సినిమాలు ప్లాప్ అవుతున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భాష సినిమా మీద కచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఇంగ్లీష్ భాషలో మాట్లాడుతూ సినిమాలు తీయటం వల్ల ఆ సినిమా కథ మూలాల్లోకి వెళ్లడం సాధ్యం కాదు. మనం మన భాష, సంసృతిలో మమేకమైనప్పుడే సినిమాలు పని చేస్తాయనీ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.