Varun Sandesh: తనతో ఇప్పటివరకు కలిసి కలిసి పని చేసిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరికీ తాను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటానని ప్రముఖ నటుడు వరుణ్ సందేశ్ అన్నారు. ఎందుకంటే తన మీద అంత డబ్బు పెట్టి, తమ కష్టార్జితం పెట్టి తనతో సినిమా చేసినందుకు నిజంగా తాను ఎపుడూ థాంక్ ఫుల్ గా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే మూవీ మేకింగ్ అనేది అంత ఈజీ కాదని ఆయన చెప్పుకొచ్చారు. మనం రెండు గంటల్లో సినిమా చూసి జడ్జ్ చేస్తాం కానీ, దాని వెనుక ఎంతోమంది కష్టం ఉంటుందో అని వరుణ్ సందేశ్ చెప్పారు.
తాను గతంలో ఏం జరిగిందని దాని గురించి ఆలోచించనని, ప్రస్తుతం చేయాల్సిన దాని పైన ఫోకస్ చేస్తానని వరుణ్ సందేశ్ అన్నారు. మనం దాని గురించి ఆలోచిస్తూ ఉంటే జీవితంలో ముందుకు వెళ్లలేమని ఆయన చెప్పారు. అది తాను చాలా నమ్ముతానని కూడా ఆయన తెలిపారు. ఇప్పుడే కాదు తన చిన్నప్పటి నుంచి కూడా ఈ విషయంలో ఇలాగే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. అందుకే తన సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఒకే విధంగా ఉంటానని, ఒకవేళ హిట్ అయినా కూడా ఒకే హిట్ అయిందా అని అనుకొని తర్వాత ఏం చేయాలి అనే దాని గురించి ఆలోచిస్తానని ఆయన చెప్పారు.
ఒకానొక సందర్భంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన తో హ్యాపీ డేస్-2 తీయాలని అనుకున్నారని హీరో వరుణ్ సందేశ్ తెలిపారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ అది ఇంప్లిమెంట్ కాలేదని ఆయన చెప్పారు. తాను కూడా ఆయన సంప్రదించలేదని వరుణ్ సందేశ్ తెలిపారు. ఆయన వెంటనే లీడర్ సినిమా చేశారని, తాను కూడా తన సినిమాల్లో బిజీ అయిపోయారని, ఆయన సినిమాల్లో ఆయన కూడా బిజీ అయిపోయారని వరుణ్ సందేశ్ వివరించారు