Ajith : అజిత్‌తో ఆ డైరెక్టర్ సినిమా: అసలు సీక్రెట్ తెలిస్తే షాకవుతారు.!

Ajith : కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌తో సినిమా అంటే అవును అస్సలు మావులుగా వుండదు మరి. భారీ సినిమాలతో వరుస హిట్స్‌తో దూసుకెళ్లిపోతున్నారాయన. రీసెంట్‌గా రిలీజైన ‘వాలిమై’ సినిమా గురించి కోలీవుడ్‌తో పాటు, టాలీవుడ్‌లోనూ మాట్లాడుకున్నారు. ఆ మాటకొస్తే, తెలుగులోనూ అజిత్ సినిమాలకి మంచి ఆదరణ వుంది.

లేటెస్టుగా అజిత్‌తో సినిమా చేసే బంపర్ ఛాన్స్ ఓ చిన్న దర్శకుడికి దక్కింది. ఆయన ఎవరో కాదు, విఘ్నేష్ శివన్. నయన తార ప్రియుడు విఘ్నేష్ శివన్ అన్న సంగతి తెలిసిందే. ఇంతవరకూ స్టార్ హీరోలను డైరెక్ట్ చేయని విఘ్నేష్ శివన్‌కి, అజిత్‌‌తో సినిమా చేసే ఛాన్సు రావడం ఒకింత ఆశ్చర్యకరమైన విషయమే.

అయితే, విఘ్నేష్‌కి ఈ ఛాన్సు రావడం వెనక నయనతార హస్తం వుందని కోలీవుడ్ టాక్. అజిత్, నయన్ కలిసి గతంలో ‘బిల్లా’, ‘ఆగన్, ‘ఆరంభం’, ‘విశ్వాసం’ సినిమాల్లో నటించారు. అన్నీ విజయవంతమైన భారీ చిత్రాలే. అలా అజిత్‌తో నయన్‌కి వున్న పరిచయం ప్రియుడు విఘ్నేష్ శివన్‌కి ఇలా ఉపయోగపడి వుంటుందని నయన్ అభిమానులు భావిస్తున్నారు.

ఏది ఏమైతేనేం, విఘ్నేష్ శివన్ జాక్ పాట్ కొట్టేశాడంతే, లైకా సంస్థ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోందట. ఈ ఏడాది చివర్లో సినిమా పట్టాలెక్కబోతోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరోవైపు, అజిత్ ‘వాలిమై’ సినిమా తర్వాత మళ్లీ అదే డైరెక్టర్ (హెచ్ వినోద్)తో సినిమా చేస్తారని అనుకున్నారంతా. కానీ, సడెన్‌గా విఘ్నేష్ శివన్‌తో ఈ సరికొత్త ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. అనుకున్నదే తడవుగా ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేసేయడం విశేషం.