Simran: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 25 ఏళ్ల తర్వాత ఆ సూపర్‌ స్టార్‌తో జతకట్టబోతున్న సిమ్రాన్‌?

Simran: ఒకప్పటి సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది సిమ్రాన్. ఆ తర్వాత సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. సిమ్రాన్ సినిమా విడుదల అయ్యి చాలా కాలం అయింది. అయితే ఇప్పుడు సిమ్రాన్ ఒక సూపర్ స్టార్ సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆ హీరో మరెవరో కాదు అజిత్. విడాముయర్చి సినిమా తర్వాత అజిత్ హీరోగా నటిస్తున్న చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. అధిక రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నాయి.

జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. అజిత్ కి జోడిగా త్రిష నటిస్తోంది. ఏప్రిల్ 10న ఈ మూవీ విడుదల కానుంది. ఇందులో భారీ యాక్షన్‌ సీన్లు ఉండబోతున్నాయని స్టంట్ మాస్టర్ చెప్పారు. యాక్షన్‌ పరంగా ఇదొక ట్రీట్ ఇవ్వబోతోందట. గుడ్ బ్యాడ్ అగ్లీ విడుదల పనులు జరుగుతున్నాయి. 50 రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో ఈ నెలలో టీజర్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో అజిత్‌ సరసన త్రిష మాత్రమే కాకుండా మరో హీరోయిన్‌ కూడా ఉందని సమాచారం.

ఆ హీరోయిన్ మరెవరో కాదు సిమ్రాన్. 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ కలిసి నటిస్తున్నారు. ఆదిక్ దర్శకత్వంలో త్రిష ఇల్లనా నయనతార సినిమాలో కూడా సిమ్రాన్‌ నటించింది. ఇప్పుడు అజిత్‌ సినిమాలో కనిపించబోతున్నారట. అప్పట్లో వీరి కాంబినేషన్‌ కి మంచి క్రేజ్‌ ఉంది. ఫ్యాన్స్ బాగా ఎంజాయ్‌ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అభిమానులు ఒకవేళ ఇది నిజమైతే నిజంగా శుభవార్త అంటూ కామెంట్ చేస్తున్నారు. ఒకప్పుడు ఈ జంటని ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇన్నేళ్ల తర్వాత ఈ జోడి మళ్లీ జతకట్టింది. ఈసారి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి మరి.