2025 త్రిష దే.. ఈమె మూవీ లైనప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ఒక స్టార్‌తో ఒక సినిమా చేయడానికి హీరోయిన్లు కలలు కంటున్న ఈ సమయంలో ఒకే స్టార్‌తో రెండు మూడు సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఆమె ఫిల్మోగ్రఫీ లిస్టు చూసిన వారికి కళ్లు తిరిగినంత పనవుతోంది.41 ఏళ్ల వ‌య‌సులోనూ యంగ్ హీరోయిన్ల‌కు గ‌ట్టి పోటీ ఇస్తోంది త్రిష‌. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం…ఇలా అన్ని ఇండ‌స్ట్రీల‌ను క‌వ‌ర్ చేస్తోంది. ఏకంగా ఏడు సినిమాలు చేస్తోంది.పైగా అన్ని సినిమాలు కూడా స్టార్ హీరోల సినిమాలు 2025 లో బిజీ హీరోయిన్ ఎవరు అంటే ముందు చెప్పేది ఆమె పేరే.

యంగ్ హీరోయిన్‌ అయితే కాదు .. అయినప్పటికీ పాన్ ఇండియా వైడ్‌ గా వరుస సినిమాల్లో దూసుకుపోతుంది. 2024 లో ఒక్క సినిమాలో కూడా నటించలేదు .. దళపతి విజయ్ నటించిన ది గోట్‌ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్లో మాత్రమే మెరిసింది. ఇప్పుడు ఆమె నటించబోయే సినిమాలు ఏమిటో చూద్దాం. ముందుగా అజిత్ హీరోగా నటిస్తున్న విదాముయార్చి సినిమాలో నటిస్తుంది .. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఈ సినిమాకు మిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు.

అలాగే అజిత్ నటిస్తున్న మరో సినిమా గుడ్ బాడ్ అగ్లీ సినిమాలోను త్రిషనే మెయిన్ హీరోయిన్గా నటిస్తుంది .. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పుష్పా నిర్మాతల మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు .చిరంజీవి, త్రిష కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న తెలుగు మూవీ విశ్వంభ‌ర వ‌చ్చే ఏడాది థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతుంది. సంక్రాంతికి రావాల్సిన ఈ మూవీని స‌మ్మ‌ర్‌కు పోస్ట్‌పోన్‌చేశారు.

త్రిష హీరోయిన్‌గా న‌టించిన మ‌ల‌యాళం మూవీ ఐడెంటీటీ జ‌న‌వ‌రి 2025లో విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తోన్నారు. క‌మ‌ల్‌హాస‌న్‌, విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం క‌ల‌యిక‌లో వ‌స్తోన్న థ‌గ్‌లైఫ్‌లో త్రిష హీరోయిన్‌గా న‌టిస్తోంది. 2025 జూన్ 5న ఈ సినిమాను విడుద‌ల‌చేయ‌బోతున్న‌ట్లు ఇటీవ‌లే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అదేవిధంగా సూర్య 45 సినిమాలోను ఈ అమ్మడే హీరోయిన్.