Jaya Vaani ఏ పని చేయాలన్నా కూడా అందుల్లో కష్టాలనేవి సహజమేనని, కానీ సినీ ఇండస్ట్రీకి వచ్చేసరికి అవి కొంచెం ఎక్కువేనని నటి జయవాణి అన్నారు. ఎవరైనా జాబ్ చేస్తే అది అంతవరకే ఉంటుందని, తమకైతే ఒక సినిమా అయిపోతే మరో సినిమా కోసం వెతుక్కోవలసిందేనని ఆమె చెప్పుకొచ్చారు. ఆర్టిస్ట్ అనేవేళ్లు అందరికీ తెలియాలి అంటే హార్డ్ వర్క్ చేయాల్సిందేనని ఆమె అన్నారు. సినిమా అనేది చాలా మందికి ఫ్యాషన్ ఉంటుందని, కానీ ఇవన్నీ స్ట్రగుల్స్‌ను ఎదుర్కొన్న వాళ్లు మాత్రమే యాక్టర్లుగా పేరు తెచ్చుకుంటారని ఆమె స్పష్టం చేశారు.
ఇకపోతే ఒక సినిమాకు సంబంధించి ఒక ఫొటోషూట్ చేద్దామని అన్నారని జయవాణి చెప్పారు. కానీ ఆ పాత్రలో ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి. అసలు అది ఎలా ఉంటుందో తనకు తెలియదు కాబట్టి ఓకే చెప్పానని ఆమె అన్నారు. అది ఎలా ఉందంటే లంబాడీ డ్రెస్ టైప్ ఉందని తనకు తర్వాత తెలిసిందని ఆమె చెప్పారు. అది వేసుకొని ఫొటోషూట్ తీసుకున్నారని ఆమె వివరించారు. అలా ఫొటోలు తీస్తున్న సమయంలో ఒక నాలుగు ఫొటోలు సరిపోతాయి కదండీ అని తను అంటే, లేదమ్మా ఫొటోషూట్ కదా అని తనకు ఏదో నచ్చజెప్పారని ఆమె తెలిపారు. అలా ఆ రోజు ఫొటోషూట్ అని చెప్పి తన ఫొటోలు తీసుకున్నారని ఆమె అన్నారు.
ఇకపోతే ఆ తర్వాత ఆ ఆఫీస్ ఏమైందో తెలియదు. ప్రొడ్యూసర్ ఏమయ్యారో, డైరెక్టర్ ఏమయ్యారో తనకు తెలియలేదని జయవాణి అన్నారు. కానీ తన ఫొటోస్ అన్నీ మాత్రం వెబ్‌సైట్‌లో వచ్చేశాయని ఆమె చెప్పారు. అవి ఎలా వచ్చాయి? వాటిని ఎలా తీసేయాలి ? ఎవరిని అడగాలని కూడా తనకు తెలియలేదని ఆమె అన్నారు. అక్కడ ఫొటోస్ తీసిన ఫొటోగ్రాఫర్ నెంబర్ గానీ, ఇంకెవరి డిటేల్స్ కూడా తాను తీసుకోలేదని ఆమె చెప్పారు. అవి ఎవరు పెట్టారో తనకు ఇప్పటికీ తెలియదని, కానీ ఇప్పటికీ అదొక మచ్చలాగా తనతో ట్రావెల్ అవుతూనే ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.