Thammareddy Bharadwaj: తాను వెటకారం చేద్దామనో, ఇంకోటనో మాట్లాడనుకుంటే ఎన్నైనా మాట్లాడొచ్చు. ఒక రాజకీయ నాయకుడు ప్రశ్నించాలంటే చాలా ఉంటాయి. కానీ తాను మాట్లాడుతుంది కేవంల సినిమా గురించే అని నిర్మాత, దర్శకుడు భరద్వాజ అన్నారు. ఉదాహరణకు తన విషయానికే వస్తే, ఈ పండగకు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యి ఉంటే, అందరూ అంటున్నట్టు టికెట్ల ధరలు పెంచి ఉంటే ఉదాహరణకు 500రూపాయిలు చేస్తే, తాను ఇంక ఈ నెలలో ఇంకో సినిమా చూడలేనని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ పెద్ద సినిమా చూడాలనుకుంటారని, తాను భరద్వాజగా కూడా అదే మాట చెబుతానని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ రేట్లు తగ్గించకపోతే, లేదా మామూలు ధర ఉంటే మాత్రం తాను రెండు, మూడు సినిమాలు చూస్తానని ఆయన తెలిపారు.
ఇది ప్రభుత్వం చేస్తుంది కాదని, సైకాలజీ ఆఫ్ మిడిల్ క్లాస్ మీద దెబ్బ కొట్టే పనే ఇది అని ఆయన అన్నారు. ఒక పెద్ద సినిమా చూడాలంటే ఇలాంటివన్నీ త్యాగం చేయాలన్న ఆయన, తాను చిన్నతనం నుంచి రోజుకి దాదాపు 3 సినిమాలు చూసేవాడినని ఇప్పుడు మాత్రం ఒక్క సినిమాకు వెళ్లాలన్నా ఆలోచించాల్సి వస్తోందని ఆయన తెలిపారు. ఎప్పుడైనా సినిమా చూడాలంటే కొనుక్కొనే వెళ్లాలి. కానీ దానికి ఇంత డబ్బు వెచ్చించాలా అని ఆయన ప్రశ్నించారు. ఒక్కరం ఎలాగూ వెళ్లలేం. ఇంకొకరితో లేదా ఫ్యామిలీతో వెళ్లాలి అనుకుంటే చాలా వెచ్చించాల్సి వస్తుందని ఆయన అన్నారు. దాంతో పాటు థియేటర్లో ఫుడ్ కూడా చాలా ఎక్కువ రేటు ఉంటుందని ఆయన అన్నారు.
అందుకే తాను థియేటర్‌కి వెళ్లి సినిమా చూడడం చాలా తగ్గిపోయిందని, ఒక నెల రోజులు ఆగితే ఓటీటీల్లోకి ఎలాగూ వస్తున్నాయి అని భరద్వాజ తెలిపారు. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అంతంత రేట్లు ఎలా పెడతాడు అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం సినిమా తీసి ఇస్తుందా అని జోకులేయడానికి బాగానే ఉంటుంది కానీ అది సామాన్య మానవునికి భారమని ఆయన వివరించారు. ఇండస్ట్రీలో ఇది నచ్చని వాళ్లు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని, అందరూ అలా కాదని ఆయన స్పష్టం చేశారు.