
యాంకర్ సమీరా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పలు సీరియల్స్‌లో హీరోయిన్‌గా నటించింది. బుల్లితెరపై యాంకర్‌గా సమీరా ఒకప్పుడు పెను సంచలనం. ఇటీవల పెళ్లి చేసుకుని, ఓ బాబుకు జన్మనిచ్చింది సమీరా. ఈ నేపథ్యంలో మదర్ మిల్క్ అవేర్‌నెస్ కోసం కొన్ని మంచి మాటలు చెప్పింది సమీరా.
‘డెలివరీ తర్వాత మొదటి 5 రోజులు నా పాలు సరిపోలేదు. కనీసం 15 ఎమ్ ఎల్ కంటెంట్ మిల్క్ కూడా వచ్చేవి కాదు. దాంతో చాలా బాధపడ్డాను. చాలా పెయిన్ అనుభవించాను. అప్పుడే తల్లి పాల విలువ ఏంటో తెలిసింది. నాలాగే చాలా మంది ఇలాగే బాధపడుతున్నారు. ఈ కారణంగా కొందరు పిల్లలు ప్రాణాలు కూడా కోల్లోపుతన్నారు.. ఆ క్రమంలోనే బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ గురించి తెలుసుకున్నాను.. ఎంతో మంది తల్లి పాలు లేని పిల్లలకు ఈ బ్రెస్ట్ మిల్క్ బ్యాంకులు సహకరిస్తున్నాయి. ఇప్పుడు నా బిడ్డకు సరిపడా పాలు నా వద్దనే దొరుకుతున్నాయి. నా బిడ్డ తాగగా మిగిలిన పాలను నేను కూడా బ్రెస్ట్ మిల్క్ బ్యాంకుకు డొనేట్ చేస్తున్నాను..’ అని సమీరా చెప్పుకొచ్చింది.
ఇదంతా పబ్లిసిటీ కోసం కాదు.. అవేర్‌నెస్ కోసం అని సమీరా చెప్పింది. సమీరా చేసిన పనికి మరో యాంకర్ ఝాన్సీ రెస్పాండ్ అయ్యింది. ‘మంచి పని చేశావ్ సమీరా..’ అని అప్రిషియేట్ చేసింది. ఈ విషయంలో అవేర్‌నెస్ పెరగాలి అని ఝాన్సీ చెప్పింది.
