ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎక్కడ చూసిన హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడులే కనిపిస్తున్నాయి. గతంలో ఇలాంటి దాడులు జరిగిన ఈ విధంగా ఇంత పక్క పథకం ప్రకారం ఇన్ని వరస సంఘటనలు జరగలేదు. పక్క పథకం అని ఎందుకు అంటున్నామంటే ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో హిందూ ఆలయాల మీద దాడులు జరిగిన దానికి బాధ్యులు ఎవరో గుర్తించి వారిని అరెస్ట్ చేసిన దాఖలాలు ఎక్కడ కనిపించటం లేదు, కానీ ఒక చర్చి యొక్క అద్దాలు పగలకొట్టారని ఏకంగా 45 మంది మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం జరిగింది. దీనిని బట్టి చూస్తే హిందూ దేవాలయాల మీద ఒక పథకం ప్రకారమే దాడులు జరుగుతున్నాయేమో అనే అనుమానం కలుగుతుంది.
రామతీర్థం
ఉత్తరాంధ్ర అయోధ్యగా భావించే రామతీర్థం జరిగిన సంఘటన పట్ల ప్రభుత్వం ఎలాంటి చిత్తశుద్ధి కలిగివుందో ఆ ఘటన జరిగిన తొలి రోజుల్లో చూస్తే అర్ధం అవుతుంది. శ్రీరాముడి తల నరికిన ఘటనలో కొన్ని లక్షల మంది మనోభావాలు దెబ్బతింటే, ముఖ్యమంత్రి కానీ దేవాదాయ శాఖ మంత్రి కానీ ఎవరు దీనిపై స్పందించిన పాపాన పోలేదు. సంఘటన జరిగిన మూడు రోజులు వరకు ఎవరు కూడా దానిని పట్టించుకోలేదు, దీనితో చంద్రబాబు నాయుడు అక్కడ ఏమి జరిగిందో తెలుసుకోవాలని భావించి అక్కడికి రావటానికి సిద్ధం కావటంతో, ఆగమేఘాల మీద స్పందించిన వైసీపీ, వెంటనే పోలీసులను మోహరించింది. బాబు పర్యటనకు గంట ముందే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకొని పరిశీలించటం జరిగింది. అంటే రాజకీయంగా ఇబ్బంది కలుగుతుందని అనిపిస్తే తప్ప వైసీపీ నేతలు దేవాలయాల మీద జరుగుతున్నా దాడులను పట్టించుకునే స్థితిలో లేరని తెలుస్తుంది.
శ్రీశైలం
హిందువులకు చెందిన మరో పుణ్యక్షేత్రం శ్రీశైలం, గత కొంత కాలం నుండి ఇక్కడ కూడా అనేక వివాదాలు చోటు చేసుకుంటున్నాయి, ముఖ్యంగా శ్రీశైలం పరిసరాల్లో ఎక్కువగా ముస్లింలు పెత్తనం నడుస్తుందని, అక్కడ దుకాణాలు కూడా వారే నిర్వర్తిస్తున్నారని అన్య మతస్తుల ప్రాబల్యం అక్కడ ఎక్కువైందని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు, తాజాగా శ్రీశైలం దేవాలయంలోకి కొందరు బైబిల్ పట్టుకొని వెళ్తున్నట్లు గుర్తించిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయటంతో బైబిల్ పట్టుకొని లోపలకు వెళ్తున్న వాళ్ళను పట్టుకున్న సెక్యూరిటీ కేవలం మత గ్రంధాన్ని స్వాధీనం చేసుకొని వాళ్ళని వదిలిపెట్టారు.
ఇదే కాకుండా రాజమండ్రి సుబ్రమణ్యస్వామి విగ్రహం ధ్వంసం చేశారు. తర్వాత నిన్న అర్ధరాత్రి విజయవాడలో సీతమ్మ తల్లి విగ్రహం ధ్వంసం చేశారు. ఇంకా ప్రతి రోజు రాష్ట్రంలో ఎదో ఒక మూలాన హిందూ దేవుళ్లను టార్గెట్ చేసుకొని దాడులు జరుగుతూనే ఉన్నాయి, కానీ వైసీపీ సర్కార్ మాత్రం దీనిపై తగిన చర్యలు తీసుకోవటం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. ఇంత పెద్ద స్థాయిలో దాడులు జరుగుతున్నా కానీ, ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా దీనిపై స్పందించకపోవటం దారుణమైన విషయమని కొందరు అంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మత పరమైన రాజకీయాలు జరుగుతున్నాయి, మరి మున్ముందు ఇవి ఎలాంటి టర్న్ తీసుకుంటాయో చూడాలి