కాబోయే అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు వీరతిలకం దిద్దిన తెలుగు పూజారి

అమెరికా అధ్యక్షపదవికి చేరువలో ఉన్న జోబైడెన్ కు వీర తిలకం దిద్ది ఆశీర్వదించారు మన తెలుగు పూజారి కశోఝల చంద్రశేఖర శర్మ. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన వేద పండితులు కశోఝల చంద్రశేఖర శర్మ యజుర్వేదం చదువుకొని రెండు దశాబ్దాల కిందటే ఆమెరికా వెళ్లి స్థిరపడ్డారు. 2003 మే నెలలో విలివింట్ సిటీలోని మహాలక్ష్మీ అమ్మవారి ఆలయం కుంభాభిషేక కార్యక్రమం జరిగిందని… అప్పట్లో  సెనెటర్ గా ఉన్న బైడెన్ ఈ కార్యక్రమానికి హాజరు కాగా తాను ప్రత్యేక పూజలు నిర్వహించి….వేద మంత్రోచ్ఛరణ మధ్య జోబైడెన్ కు వీరతిలకం దిద్ది ఆశీర్వదించినట్లు వెల్లడించారు కశోజుల చంద్రశేఖర శర్మ.

ప్రస్తుతం బైడెన్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసి ముందంజెలో ఉండడంపై హర్షం వక్తం చేశారు. ట్రంప్ మాదిరిగా కాకుండా జోబైడెన్ అందర్ని కలుపుకుపోయే వ్యక్తి అని అన్నారు చంద్రశేఖర శర్మ. అన్ని మతాల వారినీ, అన్ని దేశాల వారీని ఆయన సమానంగా చూస్తారని చెప్పారు. ముఖ్యంగా హైందవ ధర్మంపై ఆయనకు ఎనలేని గౌరవం ఉందని అన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఆయనకు అమితమైన గౌరవం ఉందని చెప్పారు. మన పద్దతులు ఆచారాలపై ఆయన ఎనలేని శ్రద్ధ కనబరుస్తారని చెప్పారు. ఈకారణాల వల్లే చాలా మంది భారతీయులు జోబైడెన్ కు ఓటేశారని చెప్పారు.

ఇక తన విషయానికి వస్తే రెండు దశాబ్దాల కిందట విలివింట్ సిటీలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజారిగా చేరానని చెప్పారు. ప్రస్తుతం డబ్లిన్ సిటీలో పూజారిగా సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు.