Chiru And Ys Jagan : షాకింగ్ – చిరు క్రెడిట్ ని కొట్టేసిన జగన్..ప్రముఖ న్యూస్ ఛానెల్ యాంకర్ మాట!

Chiru And Ys Jagan : గత కొన్నాళ్ల నుంచి కూడా ఏపీ మరియు టాలీవుడ్ లో నెలకొన్న ప్రధాన టికెట్ ధరల సమస్య మొన్నటితో ఒక కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో మరికొంతమంది స్టార్ హీరోలను దర్శకులను ఏకం చేసి తీసుకొచ్చి ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ తో కూర్చొని మాట్లాడి సమస్యని పరిష్కారం చేసే దిశగా తీసుకొచ్చారు.

ఇక ఇదిలా ఉండగా ఈ అంశం తర్వాత చాలానే కామెంట్స్ చిరు జగన్ లపై వచ్చారు. సమస్య సృష్టించిందే జగన్ లాస్ట్ లో తానే మళ్ళీ సాల్వ్ చేసినట్టు అందరినీ పిలిపించుకొని తీర్చినట్టు చేసారు అని ఇంకా చిరు చొరవ వల్లే ఇది జరిగింది అని అనేక మాటలు అయితే ఇంకా వినిపిస్తున్నాయి కానీ..

మన తెలుగు కి చెందిన ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ మాజీ యాంకర్ అయినటువంటి రజినీకాంత్ ఒక కామెంట్స్ చెయ్యడం షాకింగ్ గా మారింది. “ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న ఒక విషయం ఇండస్ట్రీ కి పెద్ద దిక్కుగా దాసరి ప్లేసులో చిరంజీవి ని కూర్చోబెట్టాలని ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ మొత్తానికి జగన్ ఆ క్రెడిట్ కొట్టేశారు….”

అంటూ అటు చిరు ఇటు జగన్ లు ఇద్దరికీ కౌంటర్ వేసినట్టుగా మాట్లాడారు. దీనితో ఈ సమస్యపై వైరల్ అవుతున్న అనేకమంది కామెంట్స్ లో ఇది పెద్ద హైలైట్ గా మారింది. అయితే తాను ఏ ఉద్దేశంతో అన్నాడో కానీ నెటిజన్స్ దీనిపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.