ట్విట్టర్ లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి గ‌ట్టి ఎదురు దెబ్బ

TelanganaRejectsLRS hashtag trends top in twitter

తెలంగాణ ప్రజలే కాదు.. వేరే రాష్ట్రాల ప్రజలు కూడా తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న ఎల్ఆర్ఎస్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదివరకే వేలకు వేలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక మళ్లీ ఎల్ఆర్ఎస్ ఎందుకు? మళ్లీ దాని కోసం వేలకు వేలు పెట్టాలా? ఇంటి పర్మిషన్ అడిగితే ఎల్ఆర్ఎస్ చేయించుకోమంటున్నారు. ఒకసారి రిజిస్ట్రేషన్, మరోసారి ఎల్ఆర్ఎస్.. ఆ తర్వాత ఇంటి పర్మిషన్.. వీటన్నింటికి వేలకు వేలు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి. ప్రభుత్వం మమ్మల్ని నట్టేట ముంచుతోంది.. అంటూ తెలంగాణ ప్రజలు బోరున విలపిస్తున్నారు.

TelanganaRejectsLRS hashtag trends top in twitter
TelanganaRejectsLRS hashtag trends top in twitter

ఎక్కువ మొత్తంలో తెలంగాణ ప్రజలు ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వ్యతిరేకిస్తుండటంతో సోషల్ మీడియాలో #TelanganaRejectsLRS హ్యాష్ టాగ్ టాప్ ట్రెండింగ్ లో ఉంది.

TelanganaRejectsLRS hashtag trends top in twitter
TelanganaRejectsLRS hashtag trends top in twitter

ఆ హ్యాష్ టాగ్ తో తెలంగాణ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఏ హ్యాష్ టాగ్ కైతే ఎక్కువ ట్వీట్స్ వస్తాయో.. ఆ హ్యాష్ టాగ్ ట్విట్టర్ లో టాప్ లో ఉంటుంది. తాజాగా ఈ హ్యాష్ టాగ్ తో నెటిజన్లు విపరీతంగా ట్వీట్లు చేస్తున్నారు.

నెటిజన్లు ఎల్ఆర్ఎస్ పై ఏవిధంగా స్పందిస్తున్నారో కొన్ని ట్వీట్లలో చూడండి..

https://twitter.com/Prudhvi_bvr/status/1315225594670379009


https://twitter.com/countrypatroit/status/1315239096353128449