హైదరాబాద్‌లో వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం.

హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నగర వ్యాప్తంగా నల్లని మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. దీంతో కొన్ని చోట్ల చిరు జల్లులు కురుస్తున్నాయి. ఆకాశం దట్టమైన మేఘాలతో కమ్ముకోవడంతో.. అప్పుడే చీకటి పడినట్లుగా అనిపిస్తోంది.  దంచికొడుతున్న ఎండలతో ప్రజల కాస్త ఉపశమనం దొరికింది. కాలాపత్తర్, జూపార్క్, ఫలక్‌నూమా, బహదూర్‌పురా, పాతబస్తీ, దుండిగల్, సూరారం, జీడిమెట్ల, దూలపల్లి, బహదూర్‌పల్లిలో వర్షం కురిసింది.