Telangana Vs Andhra Pradesh : తెలంగాణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్: ఎవరు బెస్ట్.?

Telangana Vs Andhra Pradesh : టెస్లా కంపెనీని తెలంగాణకు ఆహ్వానించారు తెలంగాణ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. అదీ సోషల్ మీడియా ద్వారా. మరి, ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తోంది.? నిజానికి, చంద్రబాబు హయాంలోనే అప్పటి మంత్రి నారా లోకేష్, టెస్లాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆహ్వానించారు. కానీ, అది సాధ్యం కాలేదు.

ఎలాన్ మస్క్.. టెస్లా అధినేత.. ప్రపంచ కుబేరుల్లో ఒకరు. అంతేనా, న్యూ జనరేషన్‌కి ఇన్‌స్పిరేషన్ కూడా. అందుకే, ఎలాన్ మస్క్ గురించిన ఏ చిన్న వార్త అయినా సర్వత్రా చర్చనీయాంశమవుతుంటుంది. తెలంగాణ – టెస్లా – ఆంధ్రపదేశ్ – ఎలాన్ మస్క్.. అంశాల చుట్టూ అలాగే చర్చ జరుగుతోంది.

కేటీయార్ ట్వీటేస్తే, దానికి ఎలాన్ మస్క్ నుంచి రిప్లయ్ వచ్చింది. పలువురు సినీ ప్రముఖులు ‘తెలంగాణకు టెస్లా రావాలని ఆకాంక్షిస్తున్నాం..’ అని పేర్కొన్నారు. అంతే, వైసీపీ మద్దతుదారులకు ఒళ్ళు మండిపోయింది. ‘ఇందుకే, మేం తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేస్తున్నాం.. వారికి అసలు మాతృభూమి ఆంద్రప్రదేశ్ మీద కనీసపాటి మమకారం లేదు..’ అంటూ మండిపడుతున్నారు వైసీపీ మద్దతుదారులు.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పబ్లిసిటీ స్టంట్లు చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. రాష్ట్రంలో కొత్తగా జరిగిన మార్పులేమీ లేవు అభివృద్ధి పరంగా. పారిశ్రామిక ప్రగతి అన్న మాటకే అర్థం లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.

తప్పెవరిది.? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నదే. అక్కడ రాజకీయ పరమైన రచ్చ కారణంగానే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోయింది. తెలంగాణఖు మాత్రం ఆ సమస్య లేదు. తెలంగాణలోనూ రాజకీయ రచ్చ అడపా దడపా కనిపిస్తున్నా, తెలంగాణ పరిస్థితి వేరు. తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రం. అందుకే, తెలంగాణతో ఏపీ పోటీపడలేకపోతోంది.. ఈ క్రమంలోనే అక్కసు తెరపైకొస్తోంది.