తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర సమితిని ఢీ కొట్టే పార్టీ లేదు, రాజకీయ నాయకుడు కూడా అస్సలు లేరు. తమను అడ్డుకునే శక్తే లేదన్న ధీమాతో తెరాస నేతలు వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు తెరాసను అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కానీ తమ వాదనలతో ప్రజల మద్దతును సంపాదించలేకపోతున్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కేసీఆర్ పాలనలో ఉన్న లోపాలను భయటపెట్టడంలో విఫలమవుతున్నారు.
2018 ఎన్నికల్లో తెరాస తాను అనుకున్న అన్ని ప్రాంతాల్లో గెలిచింది. అయితే కొన్ని స్థానాల్లో మాత్రం ఓటమి తప్పలేదు. అందులో ములుగు నియోజక వర్గం కూడా ఒకటి. ఈ నియోసక వర్గంలో తెరాస అభ్యర్థి గెలిస్తే ములుగుని జిల్లాగా మారుస్తానని, అభివృద్ధి చేస్తానని స్వయంగా కేసీఆర్ వాగ్ధానం చేశారు. అయితే ములుగు నియోజక వర్గ ఓటర్లు మాత్రం కనికరించలేదు. ఉత్యమ నాయకురాలు, మాజీ నక్సలైట్ దనసరి అనసూయ అలియాస్ సీతక్క ని గెలిపించి అధికార పార్టీకి షాకిచ్చారు.
అయితే ఇప్పుడు తెరాస నాయకులు సీతక్కను రాజకీయంగా దెబ్బతీయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె కార్యకర్తలను ఆమెకు దూరం చేస్తున్నారు. ఆమె చేస్తున్న అభివృద్ధి పనులను అడుగడున అడ్డుకుంటున్నారు. ఆమె చేయాలనుకున్న అభివృద్ధి పనులకు ప్రభుత్వంతో పాటు స్థానిక తెరాస నాయకులు కూడా అడ్డుపడుతున్నారు. సీతక్క యొక్క ప్రజాధారణను తగ్గించడానికి ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్‌ని పావుగా వాడుతూ తెరాస అధినాయకత్వం ఎత్తలు వేస్తుండటం గమనార్హం. తెరాస నాయకులు వేస్తున్న ఎత్తుగడలు తెలిసినా కూడా సీతక్క వాటిని పట్టిచుకోకుండా ప్రజా సంక్షేమంపై దృష్టి పెడుతున్నారు.
కరోనా సమయంలో రిమోట్ ఏరియాలో ఉన్న వారికి కావలసిన వస్తువులను ఆమె స్వయంగా వెళ్ళి మరీ అందిస్తున్నారు. కరోనా సమయంలో ప్రజలకు ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెరాసలో అలజడి సృష్టిస్తున్న సీతక్కను అడ్డుకోవడం కేసీఆర్ కు అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.