గుడ్ న్యూస్.. 18,334 పోస్టుల భర్తీకి పోలీస్‌ శాఖ నిర్ణయం!

AP Police

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్‌‌లు త్వరలో విడుదల కానున్నాయి. ముందుగా 18,334 పోస్టుల భర్తీకి పోలీస్‌ శాఖ రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వం వారంలో గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే.. ఆ తర్వాత ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ బెటాలియన్, సివిల్, ఆర్మ్‌డ్‌(ఏఆర్‌), కమ్యూనికేషన్‌ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిసింది. 1,500కు పైగా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఇక మిగిలిన పోస్టులు కానిస్టేబుల్‌ ( ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌(ఏఆర్‌), టీఎస్‌ఎస్‌పీ, కమ్యూనికేషన్‌ విభాగాల్లో) నియామకానికి ప్రతిపాదించినట్లు పోలీస్‌ వర్గాలు వెల్లడించాయి.