సీఎం కేసీఆర్ తర్వాత నేనే.. మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

telangana minister errabelli dayakar rao comments over political experience

ఎర్రబెల్లి దయాకర్ రావు.. రాజకీయాల్లో ఎన్నో ఒడుదొడుకులను ఎదర్కొన్న వ్యక్తి. సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో కొనసాగుతున్న వ్యక్తి. అందులోనూ ఆయన వరుసగా తన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. తన నియోజకవర్గంలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఎర్రబెల్లి అంటేనే వరంగల్ జిల్లాలో ఓ రాజకీయ బ్రాండ్. ఎర్రబెల్లి ట్రస్ట్ పేరుతో ఆయన సోషల్ సర్వీస్ కూడా చేస్తుంటారు.

telangana minister errabelli dayakar rao comments over political experience
telangana minister errabelli dayakar rao comments over political experience

2018 ఎన్నికలకు ముందు టీడీపీని వదిలి టీఆర్ఎస్ లో చేరిన ఎర్రబెల్లి 2018 ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ నుంచి బంపర్ మెజారిటీతో గెలిచారు. తర్వాత కేసీఆర్ కేబినేట్ లో మంత్రి పదవి పొందారు.

అయితే.. తాజాగా మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ తర్వాత రాజకీయాల్లో నేనే సీనియర్.. అని ఆయన వ్యాఖ్యానించారు.

సీనియారిటీలో ఎర్రబెల్లి సీనియరే కావచ్చు కానీ.. మరీ సీఎం కేసీఆర్ తర్వాత తానే అనడం మాత్రం కరెక్ట్ కాదంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారని.. కేసీఆర్ తర్వాత తానే అని చెప్పుకోవడం దేనికోసమంటూ వార్తలు వస్తున్నాయి.