Bheemla Nayak Mogilaiah : “భీమ్లా నాయక్” మొగిలయ్యకు తెలంగాణా ప్రభుత్వం భారీ ఆర్ధిక సాయం!

Bheemla Nayak Mogilaiah :  టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలుగు మూలాలు అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. అందులో భాగంగానే తన సినిమాల్లో ఎక్కడో ఒక చోట జానపద గేయాలను పెట్టడానికి ట్రై చేస్తుంటాడు. అలాగే ఒక్కో సారి తాను కూడా పాడుతూ ఉంటాడు. మరి అలాగే లేటెస్ట్ గా తాను చేస్తున్న మాస్ ప్రాజెక్ట్ “భీమ్లా నాయక్” కి కూడా అలానే చేసాడు.

ఈ సినిమాలోని భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ కి గాను ప్రపంచానికి “కిన్నెర మొగిలయ్య” అనే వ్యక్తిని పరిచయం చేసి పెద్ద ఎత్తున పాపులర్ చేశారు. దాదాపు 400 ఏళ్ల నాటి పురాతన కిన్నెర కళ అంతరించిపోతున్న సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన ఈ పని ఇప్పుడు మళ్ళీ ఆ కళకు ఆ కళనే నమ్ముకున్న మొగిలయ్యకి ఎనలేని గుర్తింపు తీసుకొచ్చాడు.

మరి రీసెంట్ గా ఆయనకి ఏకంగా అత్యున్నత జాతీయ పురస్కారం పద్మభూషణ్ అవార్డు కూడా వరించడంతో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వారు మరోసారి సాయం అందించారు. కాకపోతే ఈసారి భారీ స్థాయిలో సాయం అందించారు. ఏకంగా 1 కోటి రూపాయల ఆర్ధిక సాయాన్ని ప్రకటించమే కాకుండా ఒక ఇల్లు ఇతర అవసరాల కోసం మరింత ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. దీనితో కిన్నెర మొగిలయ్య పేరు మరోమారు మారు మ్రోగుతుంది.